ఆయుష్మాన్ ఖురానా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఆయన సినిమాలు మంచి విజయాలను సాధించడం మాత్రమే కాదు ఆయనకు నేషనల్ అవార్డు ను తెచ్చి పెట్టాయి. ఆయుష్మాన్ ఖురానా కెరియర్ మొదటి నుండి వైవిధ్యభరితమైన కథంశాలను ఎన్నుకోవడం వాటికి అయన విలక్షణ నటన తోడవడంతో సినిమాలు ప్రేక్షకులను మాత్రమే కాదు విమర్శకులను కూడా మెప్పిస్తున్నాయి.


ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానా డ్రీమ్ గర్ల్ అనే సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోని డబ్బింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో మీడీయకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయలను వెల్లడించారు. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం ఎందుకంటే ఈ సినిమాలో  నేను ఆడగొంతుతో మాట్లాడను.అలా మాట్లడటం వల్ల చాలా ఫన్ జనరేట్ అవుతుంది.

ఈ సినిమా నా కెరియర్ లోనే  మొదటి కమర్షల్  మూవీ.ఈ సినిమా చూడడానికి వచ్చే ప్రేక్షకులు తమ బ్రెయిన్స్ ని ఇంటి దగ్గర పెట్టి సినిమాకి రావాలి.డ్రీమ్ గర్ల్ చూసే వారు రెండు గంటలు సేపు నవ్వుతునే ఉంటారు. ఈ  మూవీలో  ఏలాంటి లాజిక్స్ ఉండవు కేవలం కామెడీ అనే మ్యాజిక్ ఒక్కటే ఉంటుంది అని అన్నారు.


రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రేలర్ కు మంచి ఆదారణ లభించింది.ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా ప్రెండ్ షిప్ ఆనే కాల్ సెంటర్ లో పనిచేస్తాడు. ఆడ గొంతుతో మాట్లాడితే ఎక్కువ మంది ఆట్రాక్ట్ అవుతారని పూజ అనే మారుపేరుతో మాట్లాడాటం మొదలుపెడుతాడు. చివరికి అందరు పూజను ప్రేమిస్తారు. తరువాత ఎం జరిగిందో తెలియాలంటే సినిమా చూడాలి.డ్రీమ్ గర్ల్ ను బాలాజీ టెలీ ఫిల్మ్స్ బ్యానర్ పై ఏక్థ కపూర్ నిర్మిస్తుంది.నుష్రత్ భారుచ లీడ్ లేడి గా నటిస్తుంది.ఈ చిత్రాని రాజ్ శాండిల్య దర్శకత్వం వహిస్తున్నారు.సెప్ట్ంబర్ 13నా ప్రపంచ వ్యాప్తంగా రిలిజ్ అవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: