‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా తో అదిరిపోయే హిట్ కొట్టిన పూరి జగన్నాథ్ తో  విజయ్ దేవరకొండ సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. దాదాపు చాలా సంవత్సరాల తర్వాత పూరి జగన్నాథ్ కి హిట్ రావడంతో ప్రస్తుతం ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ పేరు మారుమోగుతోంది. అదేవిధంగా ఇండస్ట్రీలో ప్రస్తుతం విజయ్ దేవరకొండ టైం నడుస్తున్న క్రమంలో పూరితో సినిమా ఒప్పుకోవడంతో...వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ సినిమాకి ఫైటర్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి.


ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ లో పూరి జగన్నాథ్ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించబోతున్నాడు అంటున్నారు ఇండస్ట్రీలో ఉన్న చాలామంది. గమ్మత్తైన విషయం ఇక్కడ ఒకటి ఏంటంటే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన ‘అమ్మానాన్న ఓ తమిళమ్మాయి’ సినిమా కి ప్రస్తుతం పోలిక విజయ్ దేవరకొండ చేయబోయే సినిమా సీక్వెల్ అని అంటున్నారు. ఇక విషయానికి వస్తే అప్పట్లో 2003 వ సంవత్సరంలో రవితేజ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన 'అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి' సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.


ఇటువంటి నేపథ్యంలో పూరి జగన్నాథ్... విజయ్ దేవరకొండ కోసం తయారు చేస్తున్న స్క్రిప్ట్ లైన్ కూడా ఆ సినిమాకి సిమిలర్ గా ఉన్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి. అంతేకాకుండా సినిమాలో బాక్సింగ్ సన్నివేశాలు మరింత ఇంటెన్సిటీతో చూపించబోతున్నారట. విజయ్ దేవరకొండని తెరపై మాసివ్ గా చూపించడానికి ఈ కథను ఎన్నుకున్నాడని చెబుతున్నారు. మరో పక్క డియర్ కామ్రేడ్ సినిమా దారుణంగా ఫ్లాప్ అవడంతో ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని విజయ్ దేవరకొండ ఈ స్టోరీ సెలక్ట్ చేసుకున్నట్లు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: