రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సాహో. ఇప్పటికే  దేశవ్యాప్తంగా సినిమా లవర్స్ లో విపరీతమైన అంచనాలున్న ఈ సినిమా, ఈనెల 30వ తేదీన గ్రాండ్ లెవెల్లో, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ సరసన  బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ జోడి కడుతున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ పై ప్రభాస్ స్నేహితులైన వంశి మరియు ప్రమోద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 

దాదాపుగా రూ.350 కోట్లకు పైగా ఖర్చుతో రూపొందుతున్న ఈ సినిమా, బిజినెస్ పరంగా ఇప్పటికే మూడొంతులకు పైగా పెట్టుబడిని రాబట్టినట్లు సమాచారం. ఇకపోతే మరొక ఐదురోజుల్లో ప్రేక్షకుల ముందుకు  రానున్న ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఎంతో కీలకమని, అలానే ఆయన పాత్రలో ఒక ట్విస్ట్  ఉందని, ఇటీవల దర్శకుడు సుజీత్ మీడియాతో మాట్లాడుతూ చిన్న హిట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ విషయమై కొద్దిరోజులుగా ప్రచారం అవుతున్న వార్తలను బట్టి, ప్రభాస్ ఇందులో ఒక అండర్ కవర్ కాప్ గా నటిస్తున్నారని అంటున్నారు. అయితే ప్రభాస్ క్యారెక్టర్ పై టాలీవుడ్ సహా పలు ఇతర సినిమా ఇండస్ట్రీల్లోనూ నేడు ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. అదేమిటంటే, ఇందులో ప్రభాస్ ఏకంగా రెండు క్యారెక్టర్స్ లో, అంటే డబుల్ రోల్ లో నటిస్తున్నారని, 

అయితే అందులో ఒకరు కాప్ కాగా, రెండవ వ్యక్తి సినిమాలో అత్యంత కీలకమైన రాబరీ జరిగే సీన్ లో, విలన్స్ గ్యాంగ్ సభ్యుడిగా ఉంటాడని అంటున్నారు. అంటే, రెండు క్యారెక్టర్స్ లో ఒకటి మంచిది క్యారెక్టర్ కాగా, రెండవది చెడ్డ క్యారెక్టర్ అని అర్ధం అవుతోంది. అయితే ఈ వార్త నేడు అన్ని సినీ మీడియా మాద్యమాల్లోనూ విస్తృతంగా ప్రచారం అవుతుండడంతో, ఇది నిజమే అనే వాదన కూడా బలంగా నడుస్తోంది. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ పుకార్ల గురించి ఇపుడే ఏమి మాట్లాడలేమని, రేపు సాహో సినిమా రిలీజ్ అయి, చూసిన తరువాతనే ఏదైనా మాట్లాడగలం అని, కాబట్టి ఇటువంటివి నమ్మలేం అని కొందరు సినీ విశ్లేషకులు వీటిని కొట్టిపారేస్తున్నారు....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: