యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ‘సాహో’. ‘బాహుబలి’ వంటి భారీ విజయం తర్వాత దేశవ్యాప్తంగా తో పాటు ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ క్రేజ్ మరియు మార్కెట్ క్రియేట్ చేసుకున్న ప్రభాస్ ఇప్పుడు అదే స్థాయిలో హిట్ కొట్టడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో ఈ సినిమా విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమా నిర్మాతలు యు.వి.క్రియేషన్స్ సంస్థకు చెందినవారు మొదటి వారంలో సినిమా టికెట్ రేటు పెంచడానికి రెడీ అయిపోయారు.


ఇటువంటి తరుణంలో నాచురల్ స్టార్ నాని సాహో సినిమా విడుదల రోజు అనగా ఆగస్టు 30వ తారీఖున తాను నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా ట్రైలర్ విడుదల చేసి తన అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అయిపోయినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి. విలక్షణ దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కూడా సాహో వల్ల విడుదల వాయిదా పడింది.


అయితే ఇప్పుడు ఇదే సాహో తో ఈ సినిమా ట్రయిలర్ ను ఈ నెల 28న విడుదల చెయ్యబోతున్నట్టుగా చిత్ర యూనిట్ తెలుపుతూనే ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న “సాహో” సినిమాతో కూడా అటాచ్ చేస్తున్నట్టు సినిమా యూనిట్ తెలిపింది. ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ అందించడం జరిగింది. సెప్టెంబర్ 13వ తారీఖున ఈ సినిమా విడుదల కానుంది. మొత్తం మీద ఆగస్టు నెల చివరాకరి నుండి పెద్ద సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విడుదల అవటానికి సిద్ధంగా ఉన్నట్లు అర్థం అవుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: