ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి రెండుభాగాల సినిమాలతో అత్యద్భుతమైన విజయాలు సొంతం చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్, ప్రస్తుతం బాలీవుడ్ రేంజ్ సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. ఇక ప్రస్తుతం ఆయన హీరోగా రూపొందుతున్న సాహో సినిమా కోసం దేశవాప్తంగా ఉన్న డార్లింగ్ ఫ్యాన్స్ తో పాటుగా సాధారణ ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా రిలీజ్ కు కేవలం మరొక నాలుగు రోజలు మాత్రమే మిగిలి ఉండడంతో వారిలో ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అనే ఉత్సాహం మరింత పెరుగుతోంది. 

దాదాపుగా రూ. 350 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా, బిజినెస్ పరంగా చాలావరకు పెట్టుబడిని ముందే రాబట్టినట్లు కొద్దిరోజలుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే నేడు ఈ సినిమా పై కొందరు ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్న లెక్కల ప్రకారం, సాహో సినిమా రెండు తెలుగు రాష్ట్రాలు సహా అన్ని ప్రాంతాల్లో కలిపి రూ. 310 కోట్లవరకు ప్రి రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. అయితే ఈ రేంజ్ బిజినెస్ తో ఇప్పటివరకు సౌత్ నుండి అత్యధిక బిజినెస్ చేసిన సినిమాల్లో మూడవ స్థానంలో నిలిచిందట సాహో. ఇక రూ.395 కోట్లతో రజినీకాంత్, శంకర్ ల కాంబినేషన్లో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన హిట్ మూవీ 2.0 రెండవ స్థానంలోనూ, 

అలానే రూ.425 కోట్లతో బాహుబలి 2 మొదటి స్థానంలోనూ నిలిచాయట. మరి దీని ప్రకారం చూసుకుంటే మొదటి మూడు స్థానాల్లో అత్యధిక బిజినెస్ చేసిన సినిమాల్లో రెండు సినిమాలు రెబల్స్ స్టార్ ప్రభాస్ వే కావడం ఇందులో మరొక విశేషమని కూడా వారు అంటున్నారు. మరి ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎంతో విపరీతమైన అంచనాలు ఏర్పరుచుకున్న సాహో, రేపు రిలీజ్ తరువాత ఎంతటి విజయాన్ని అందుకుని, నిర్మాతలకు ఎంతవరకు లాభాలు తెచ్చిపెడుతుందో తెలియాలంటే మాత్రం మరొక్క నాలుగు రోజులు ఓపికపట్టాల్సిందే...!!


మరింత సమాచారం తెలుసుకోండి: