బిగ్ బాస్ సీజన్ 3 లో క్రేజీ కంటెస్టంట్ గా వచ్చిన యాంకర్ తీన్మార్ సావిత్రి అలియాస్ శివ జ్యోతి హౌజ్ లో అందరితో సరదాగా ఉంటూ తన ఆట తను ఆడుతూ వస్తుంది. ఇప్పటికే ఆరు వారాల్లో ఐదుగురు ఇంటి సభ్యులు ఎలిమినేట్ అవగా రెండు మూడు సార్లు నామినేషన్స్ లో ఉన్న శివ జ్యోతి హౌజ్ స్ట్రాంగ్ కంటెస్టంట్స్ లో ఒకరిగా ఉన్నారు.  


తను ఏం చేసినా ఏం చెప్పినా తన మనసులో నుండి చెప్పినట్టుగా ఉంటుంది. అంతేకాదు హౌజ్ లో ఎవరు ఏం చేసినా మొదట ఎమోషనల్ గా ఫీల్ అయ్యేది శివ జ్యోతి మాత్రమే. అయితే శివ జ్యోతి బిగ్ బాస్ హౌజ్ కు రావడం వల్ల V6 న్యూస్ కు పెద్ద దెబ్బే పడ్డది. వి6లో శివ జ్యోతితో కలిసి బిత్తిరి సత్తి కలిసి చేసే తీన్మార్ వార్తలు ఇప్పుడు రావట్లేదు.  


రీసెంట్ గా V6 నుండి చేవెళ్లె రవి అలియాస్ బిత్తిరి సత్తి కూడా బయటకు వచ్చి టివి9లో చేరాడు. టివి9లో అతను ఎలాంటి ప్రోగ్రాం చేస్తాడో తెలియాల్సి ఉంది. వి6 తీన్మార్ వార్తలతో చాలా పాపులర్ అయిన బిత్తిరి సత్తి ఇలా సడెన్ గా TV9 లో చేరి అందరికి షాక్ ఇస్తాడని ఎవరు ఊహించలేదు. అది కూడా శివ జ్యోతి బిగ్ బాస్ హౌజ్ కి వెళ్లాక ఈ నిర్ణయం తీసుకోవడంపై అందరు అవాక్కవుతున్నారు.  


V6 నుండి బిత్తిరి సత్తి TV9 కు వెళ్లడానికి రాజకీయమైన కారణాలు ఉన్నాయని అంటున్నా.. శివ జ్యోతి ఉంటే మాత్రం బిత్తి సత్తిని V6 నుండి బయటకు వెళ్లకుండా ఆపేదేమో అంటున్నారు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చాక శివ జ్యోతిని కూడా TV9కి వెళ్తుందని అంటున్నారు. మరి తమ్ముడు సత్తి వెళ్లాడు కదా అని సావిత్రి అక్క కూడా TV9కి వెళ్తుందా లేదా అన్నది ఆమె బయటకు వచ్చాక కాని తెలుస్తుంది.    



మరింత సమాచారం తెలుసుకోండి: