ఇటీవల  'జెర్సీ' తో సూపర్ హిట్ కొట్టిన  నాచురల్ స్టార్ నాని  తాజాగా 'గ్యాంగ్ లీడర్' తో ప్రేక్షకులముందుకు  రానున్నాడు.  విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫై మంచి మంచి అంచనాలు వున్నాయి. కామెడీ  థ్రిల్లర్ గా  రూపొందుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 13న విడుదలకానుంది. ఇక ఈ సినిమా తరువాత ప్రస్తుతం నాని  , మెహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో వి అనే చిత్రంలో నటిస్తున్నాడు. మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో సుధీర్ బాబు మరో హీరోగా నటిస్తున్నాడు. కాగా ఈ సినిమా లో నాని నెగిటివ్ షేడ్స్ వున్న పాత్రలో కనిపించనున్నాడని సమాచారం.  దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. 




ఇక గత కొద్దీ రోజుల నుండి  ప్లాప్ డైరెక్టర్స్ అంతా నాని చుట్టూ తిరుగుతున్నారు.  ఎలాగైనా నానికి కథ చెప్పి ఒప్పించాలని కొందరు యువ డైరెక్టర్లు ప్రయత్నాలు చేస్తుండగా  నాని మాత్రం వారితో రిస్క్ చేసేలా కనిపించడం లేదు. అందుకే ఈ సారి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ తో మరో సినిమా చేయడానికి ఓకే చెప్పాడని తెలుస్తుంది.  శివ చెప్పిన లైన్  నానికి బాగా నచ్చడంతో వెంటనే సినిమాకు ఓకే చెప్పాడట.  ప్రస్తుతం శివ  స్క్రిప్ట్ ను  పూర్తి చేసే పనిలో వున్నాడట.  షైన్ స్క్రీన్స్ పతాకం ఫై  సురేష్ పెద్ది , సాహూ గారపాటి ఈచిత్రాన్ని నిర్మించనున్నారు.




కాగా శివ -నాని ల కాంబినేషన్ లో ఇది రెండో సినిమా.గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన 'నిన్ను కోరి' సూపర్ హిట్ అయ్యింది.  అలాగే ఇటీవల శివ నిర్వాణ మజిలీ తో కూడా బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టాడు.  దాంతో ఈ డైరెక్టర్ తీయబోయే తదుపరి సినిమాఫై ఆసక్తి నెలకొంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: