ప్రపంచ స్థాయి రికార్డులను బ్రేక్ చేసిన బాహుబలి తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం "సాహో".. దాదాపుగా 500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహించారు. యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. భారీ బడ్జెట్ తోను, ముందెన్నడూ లేని విధంగా యాక్షన్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. బాహుబలి తర్వాత దాదాపుగా రెండేళ్లు గ్యాప్ తీసుకున్న డార్లింగ్ ఈ సినిమాకు అంతే భారీగా కనిపించడానికి కాస్త ఒళ్ళు చేసాడు. ఇకపోతే ప్రభాస్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ జోడిగా నటిస్తుంది.

విషయానికొస్తే.. ఈ సినిమా మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు ఏదొక విధంగా ఫ్యాన్స్ ను ఊరిస్తూ వస్తున్నారు ఆ చిత్ర యూనిట్. ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్లు, ట్రైలర్స్, సాంగ్స్ రిలీజ్ అయిన కొద్దీ గంటలకే మిలియన్ వ్యూస్తో తో దూసుపోయిన విషయం తెలిసిందే.. మరో విషయమేంటంటే.. ఆ సినిమాలోని ప్రతి పాట ఒక్కో అద్భుతాలోకాన్ని తలపించగా, స్పెషల్ సాంగ్ లో కనిపించిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అందరిని నోర్లు వెళ్ళబెట్టుకునేలా చేసింది. బాలీవుడ్ నటులు నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, ఎవ్లిన్‌ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీలు ప్రత్యేక పాత్రల్లో నటించారు. ఒకేసారి ఈ సినిమాను నాలుగు భాషల్లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు ఆ చిత్ర యూనిట్. 

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు ముగించుకొని, ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉంది. అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో ప్రభాస్ తన స్టైల్లో అదరగొడుతున్నారు. ఆ ప్రమోషన్లో భాగంగా డార్లింగ్ వాళ్ళు నాకు ఫ్యాన్స్ కాదు డైహార్ట్ ఫ్యాన్స్ అన్నాడో లేదోగాని, ఒక ఒరిస్సాలోని ప్రభాస్ వీరాభిమాని 486 రూబిక్ క్యూబ్స్‌తో 13 గంటల పాటు శ్రమించి ప్రభాస్ ముఖచిత్రాన్ని తయారు చేశాడు. ప్రభాస్ కోసం అయన ఫ్యాన్ చేసిన ఈ కొత్త ప్రయోగానికి అందరు ఫిదా అయ్యారు.అంతేకాదండోయి.. ఆ ముఖ చిత్రం  కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఇంకో మూడురోజుల్లో ఒకేసారి నాలుగు భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకోసం ప్రపంచ వ్యాప్తంగాఉన్న డార్లింగ్ ఫ్యాన్ తో పాటుగా, సినీ ప్రరిశ్రమలోని అందరు ఎదురుచూస్తున్నారు. సాహో బాహుబలి కన్నా ఎక్కువ బడ్జెట్ తో రూపొందించబడు తుంది. బాహుబలి రికార్డులను క్రాస్ చేస్తుందా లేదా అని సినీ అభిమానుల్లో ఇప్పటి నుండే ఆసక్తి మొదలైంది . మరి ఈ సినిమా వాళ్ళ ఊహలను రీచ్ అవుతుందో లేదో  తెలియాలంటే థియేటర్లలో ఈ సినిమాను చూడాల్సిందే మరి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: