జీవితా రాజశేఖర్  పెద్ద కుమార్తె  శివాని రాజశేఖర్ బాలీవుడ్ లో విజయం సాధించిన  2 స్టేట్స్ తెలుగు రీమేక్ తో హీరోయిన్ గా  లాంచ్ కావాల్సి వుండే అయితే  గత ఏడాది  ప్రారంభమైన ఈ చిత్రం 6నెలలు షూటింగ్ జరుపుకుంది కానీ అవుట్ ఫుట్ నచ్చకపోవడం తో ఈసినిమా ను పక్కకు పెట్టారు.  అడివి శేష్ ఈ సినిమాలో  హీరోగా నటించాడు.  అయితే  సినిమా కు రిపేర్లు చేద్దాం అని మేకర్స్  చేసిన  ప్రయత్నాలు కూడా ఫలించలేదు.  అలా  మొదటి సినిమానే  శివానికి చేదు జ్ఙాపకాన్ని మిగిల్చింది. ఈ సినిమా తరువాత శివాని కి మరో ఆఫర్ రాలేదు. దాంతో ఆమె  తన తండ్రి హీరోగా  నటించిన 'కల్కి' అనే సినిమాకు సహ నిర్మాత గా వ్యవహరించింది.   ఇది కూడా ఆమె కు నిరాశనే మిగిల్చింది. ఇటీవల విడుదలైన  ఈ చిత్రం పరాజయాన్ని చవి చూసింది. 






ఇక ఇప్పుడు శివాని మరో సారి హీరోయిన్ గా రీలాంచ్ అయ్యేందుకు ఎదురుచూస్తుంది. అందులో భాగంగా తాజాగా ఓ ఫొటో షూట్ లో పాల్గొంది శివాని.  ఇప్పుడు షూట్ లోని  ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.  ఆ ఫోటో లో హాట్ లుక్స్ తో కనిపించింది శివాని.  మరి  ఆమె ను ఎవరు హీరోయిన్ గా రీ లాంచ్ చేస్తారో చూడాలి.  ఇక శివాని రాజశేఖర్ చెల్లెలు  శివాత్మిక కూడా ఈ ఏడాది  దొరసాని సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.  విజయ్ దేవరకొండ  తమ్ముడు  ఆనంద్ దేవరకొండ  ఈసినిమాలో హీరోగా నటించాడు. అయితే ఇటీవల విడుదలైన ఈ సినిమా కూడా విజయం సాధించలేకపోయింది. ఇక శివాత్మిక కూడా  ప్రస్తుతం  మరో ఆఫర్ కోసం ఎదురుచూస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: