సాధారణంగా హీరోలు సిక్స్ ప్యాక్ తో కనిపించాలనుకుంటారు. ఇక్కడ విచిత్రమేంటంటే ఓల్డ్ హీరోలు కూడా యంగ్ లుక్ రావడానికి చాలా కష్టపడి మరి కసరత్తులు చేస్తూ ఉంటారు. ఉదాహరణకు చెప్పాలంటే అక్కినేని నాగార్జున. ఇతగాడు అరవై ఏళ్ల వయసులో కూడా రొమాంటిక్ గా సినిమాలో కష్టపడాలని చాలా ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం చిరు, వెంకీ, రవితేజ, బాలయ్య ఇలా చెప్పుకుంటూ పోతుంటే మన తెలుగు హీరోలు కష్టం మీదే బ్రతికేస్తున్నారు. ఎంత చేసిన కూడా పథ చింతకాయ పచ్చడి ఎన్నోరోజులు తినాలి అంటున్నారు సినీ అభిమానులు. 

తెలుగు సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే సినిమాలకోసం ఎంచుకొనే కథలు భిన్నంగా ఉండాలి. అప్పుడే తెలుగు ప్రేక్షకులు సినిమాలను చూడటానికి ఇష్టపడుతుంటారు. ఒక్క సినిమా హిట్ అయింది.. నాకు వరుస ఆఫర్లువస్తాయి అని చాలా మంది అనుకుంటారు. ఆ కోణంలో చూసుకుంటే ఆర్ ఎక్స్ 100 సినిమాతో రొమాంటిక్ కిల్లర్ గా పేరు తెచ్చుకున్న హీరో కార్తికేయ. ఆ సినిమా తర్వాత హిప్పీ సినిమాలో నటించారు. కథ బాగలేదని టాక్ రావడంతో కొద్దిరోజులకే సినిమాకు ప్యాక్ అప్ చెప్పేసారు. 

తాజాగా ఈ హీరో గుణ 369 సినిమాలో నటించారు. ఆ సినిమాలో హీరో పాత్రకన్నా పాటలకే ఎక్కువ ప్రాధాన్యం లభించింది. సినిమా అతనికి నిరాశే మిగిల్చింది. కెరియర్ మొదట్లో అనుకోకుండా హిట్ కొట్టిన ఈ హీరో ఇప్పుడు అనుకున్న కూడా ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఎక్కువ రోజులు నిలవలేకపోయాయి. హీరోగా చేయడం కన్నా విలన్ గా చేస్తే మంచి పాపులారిటీని సంపాదిచుకోవాలనుకున్న ఈ హీరో నెగిటివ్ షేడ్స్ పాత్రల్లో కనిపించబోతున్నారు. ప్రస్తుతం నాని నటిస్తున్న తాజా చిత్రం గ్యాంగ్ లీడర్.. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథాంశంతో తెరకెక్కుతుంది. విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు  మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ నిర్మిస్తున్నారు. వచ్చే నెల 13 న వాల్మీకి సినిమాకు పోటీగా రిలీజ్ అవ్వబోతుంది. ఇకపోతే ఈ నెల 28 న ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయాన్నారని సమాచారం. 

ఈ నేపథ్యంలో హీరో కార్తికేయ మాట్లాడుతూ.. ఈ సినిమా కథ వినగానే నేను ఓకే చేసాను. ఇంత తక్కువ టైమ్‌లో ఇలాంటి ఒక మంచి క్యారెక్టర్‌ రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో నేను భయపెట్టే క్యారెక్టర్లో కనిపిస్తాను. నేను సినిమాలలోకి రావడానికి నాని గారే నాకు ఇన్స్ప్రెషన్, ఇప్పుడు ఆయనతో ఒకే స్క్రీన్ లో కనిపించడం నా అదృష్టం. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని నేను కూడా ఎదురుచూస్తున్న అని కార్తికేయ వెల్లడించారు. కనీసం నెగిటివ్ పాత్ర అయినా ఇతగాడికి కలిసొస్తుందో లేదో చూడాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: