సినీ పరిశ్రమంలో రాణించాలంటే అందం, అభినయం మాత్రమే కాదు ధైర్యం కూడా ఉండాలని అంటుంది బాలీవుడ్ నటి విద్యాబాలన్.  సినిమాల్లో అవకాశాలు అంత సులువుగా రావని ఎంతో కష్టపాడాల్సి వస్తుందని అన్నారు. ఈ మద్య సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్, మీ టూ ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఎంతో మంది నటీమణులు  తాము ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ అనుభవాలను బయటపెట్టారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అని అంటోంది.

గతంలో బాలీవుడ్ తనూశ్రీదత్తా ప్రముఖ నటుడు నానా పటేకర్ పై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పదేళ్ల క్రితం ఓ మూవీ షూటింగ్ సమయంలో డైరెక్టర్, కొరియో గ్రఫర్ ల ముందు తనను ఘోరంగా అవమానించాడని, లైంగికంగా వేధించాడని ఆరోపించింది. ఇదే విషయంపై సింగర్ చిన్మయి కూడా స్పందించి తనను రచయిత వైరముత్తు లైంగికంగా వేధించాడని ఆరోపించారు. ఇలా సినీ తారలకు కూడా లైంగిక వేధింపులు తప్పడం లేదని పెద్ద చర్చలే మొదలయ్యాయి.

తాజాగా ప్రముఖ నటి విద్యాబాలన్ కి కూడా ఇలాంటి ఛేదు అనుభవమే ఎదురైందని ఆవేదన వ్యక్తం చేసింది. ఒక దర్శకుడు తనను రూమ్ కి రమ్మంటూ పిలిచాడని విద్యాబాలన్ చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. గతంతో ఓ సినిమా కాన్సెప్ట్ చెప్పడానికి ఓ దర్శకుడు తన వద్దకు వచ్చి కథ గురించి చెప్పాలని అన్నారు.  ఆ కథ వివరించాలంటే కాస్త సమయం పడుతుందని అన్నాడు.

దాంతో ఓకే మనం కాఫీ షాప్ లో కలిసి సుదీర్ఘంగా మాట్లాడుకుందామని అన్నాను..కానీ అతడు మాత్రం మా రూమ్ కి రండి వివరంగా మాట్లాడుకుందాం అంటూ చెప్పుకొచ్చాడు.  ఇలా నేను ఎన్ని సార్లు అడిగినా అదే మాట అనడంతో తనకు పూర్తిగా అర్థం అయ్యిందని..మరోసారి కలిసినపుడు తనను బయట నుంచి బయటకే పంపించి వేశానని అన్నారు. చెన్నైలో తనకు ఈ అనుభవం ఎదురైందని విద్యా చెప్పింది. అయితే ఆ దర్శకుడు ఎవరనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: