శంకర్ తన సినిమాల్లో బెస్ట్ అని చెప్పే సినిమా భారతీయుడు.  ఈ సినిమా అప్పట్లో పెను సంచలనం.  అవినీతిపై ఓ స్వాతంత్ర సమరయోధుడు చేసిన పోరాటమే భారతీయుడు.  సేనాపతిగా కమల్ హాసన్ నటన అద్భుతం అని చెప్పొచ్చు.  ఇందులో డబుల్ రోల్ పోషించారు.  అప్పటి పరిస్థితులకు అనుగుణంగా.. అప్పటి అవినీతికి అనుగుణంగా సినిమాను తీశారు.  భారీ హిట్ అయ్యింది.  


ఆ తరువాత కొంతకాలానికే భారతీయుడు సినిమాకు సీక్వెల్ చేయాల్సి ఉన్నా కుదరలేదు.  కాగా, ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెస్తున్నారు.  ఈ ఏడాది ఫిబ్రవరిలోనే సినిమా ప్రాంభమయ్యి షూటింగ్ స్టార్ట్ చేసినా కొన్ని కారణాల వలన పెండింగ్ పడింది.  ఒకానొక దశలో సినిమా ఆగిపోతుంది అనుకున్నారు.  కానీ, ఇప్పుడు ఈ సినిమా తిరిగి ప్రారంభం అయింది. 


రాజమండ్రి సెంట్రల్ జైలులో షూటింగ్ చేశారు. సినిమా తిరిగి పట్టాలెక్కడంతో భారతీయుడు 2 కు క్రేజ్ పెరిగింది.  ఇందులో కాజల్ హీరోయిన్.  రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్ధ్ లు లీడ్ రోల్ చేస్తున్నారు.   ఇందులో కమల్ హాసన్ డబుల్ రోల్ చేస్తున్నారా లేదంటే సేనాపతిగా మాత్రమే చేస్తున్నారా అన్నది తెలియాలి.  ఇక ఈ సినిమాకు ఇప్పుడు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. 


అందులో ఒకటి సినిమా స్టోరీ లీక్.  ఈ సినిమా కథ ఇదే అంటూ ప్రచారం జరుగుతున్నది.  ఫస్ట్ పార్ట్ లో సేనాపతి విదేశాలకు వెళ్లినట్టు చూపించారు.  ఇలా విదేశాలకు వెళ్ళిపోయిన సేనాపతి.. తన మనవడు సిద్దార్ద్ వలన ఇండియాకు తిరిగి వస్తాడు.  యూట్యూబ్ లో ఛానల్ ను నడిపే సిద్దార్ద్ కొంతమంది అవినీతి పరుల బండారాన్ని బయటపెడతాడు.  దీంతో సిద్దార్ద్ కుటుంబం చిక్కుల్లో పడుతుంది.  సిద్దార్ధ్ కుటుంబాన్ని ఆదుకోవడానికి విదేశాల్లో ఉన్న నానాపతి ఇండియాకు తిరిగి వస్తాడు.  వచ్చిన తరువాత ఏం జరిగింది అన్నది మిగతా కథ.  


మరింత సమాచారం తెలుసుకోండి: