అక్కినేని సమంత పెళ్ళికి ముందు సినిమాల్లో గ్లామర్ పాత్రల్లో నటించినప్పటికీ పెళ్ళయిన తరువాత మాత్రం అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటిస్తుంది. ఈ సంవత్సరం మజిలీ, ఓ బేబీ సినిమాలతో విజయాలు అందుకుంది సమంత. ప్రస్తుతం సమంత ఒక వెబ్ సిరీస్ తో పాటు 96 రీమేక్ లో నటిస్తోంది. సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లో ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటో గురించి నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 
 
సినిమాల్లో గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటున్న సమంత నిజ జీవితంలో మాత్రం షేర్ చేసే ప్రైవేట్ పిక్స్ లో గ్లామర్ ఏ మాత్రం తగ్గించటం లేదు. గతంలో సమంత హాట్ గా ఉండే ఫోటోలు పోస్ట్ చేసినపుడు అక్కినేని అభిమానులు, నెటిజన్లు పెళ్ళైన తరువాత హాట్ గా ఉండే ఫోటోలను పోస్ట్ చేయవద్దని సమంతకు కామెంట్ల రూపంలో విఙప్తి చేసారు. కానీ సమంత మాత్రం ఈ విషయంలో ఏం మారలేదు. 
 
ప్రస్తుతం సమంత స్పెయిన్ లో ఉంది. భర్త నాగచైతన్యతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది.ఈ వెకేషన్ కు సంబంధించిన ఫోటో సమంత పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో సమంత స్విమ్ సూట్ లాంటి డ్రస్ లో కనిపిస్తుంది. ఈ ఫోటోలో సమంత హాట్ గా ఉందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ ఫోటోను నాగచైతన్య తీసాడని సమంత చెప్పటం విశేషం. 
 
నెటిజన్లు మాత్రం ఈ ఫోటోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు హాట్ గా కనిపిస్తున్నావని అంటుంటే, మరి కొందరు ఇలాంటి ఫోటోలు షేర్ చేయవద్దని సమంతకు సలహాలిస్తున్నారు. మరికొందరు నాగ చైతన్య అయినా ఇలాంటి పోస్ట్ లు చేయవద్దని సమంతకు చెప్పాలని కామెంట్ చేస్తున్నారు. మరి సామ్ నెటిజన్ల అభిప్రాయాలు చూసిన తరువాత ఇక ముందు ఇలాంటి ఫోటోలు షేర్ చేస్తుందో లేదో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: