అమోఘ్  ఎంటర్ ప్రైజెస్  పతాకం  పై   రాజ్ సూర్య‌న్, ప్రభాకర్ రెడ్డి, కిరణ్ రెడ్డి  నిర్మాతలుగా "తిరుగుబోతు " చిత్రం ద్వారా  టాలీవుడ్ కి హీరో గా పరిచయమైన  యాక్షన్ స్టార్ రాజ్ సూర్యన్ హీరోగా  ఈ  సారీ మూడు డైనమిక్ మరియు డిఫరెంట్  పాత్రలు, గెటప్ లతో   వస్తోన్న చిత్రం `నా పేరు రాజా`.    `ఈడో రకం... డెఫినెట్లీ డిఫరెంట్`  అనేది టాగ్ లైన్.  ఇక ఇందులో బోల్డ్ అండ్  బ్యూటిఫుల్  ఆకర్షిక మరియు  హాట్ మోడల్ నస్రీన్ హీరోయిన్ లు గా నటిస్తున్నారు.  ఈ యాక్షన్ థ్రిల్లర్ అండ్  రొమాంటిక్ చిత్రం ద్వారా ప్రభు సూర్య, ఆయుశ్రీ, ఇరాన్ సూపర్ మోడల్ అవ సఫాయి, ఆరాధ్య  నటీ నటులుగా పరిచయమవుతున్నారు.  ఈ సినిమా షూటింగ్ పూర్తైన  సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ...`` ఆంధ్ర-తెలంగాణ, కేరళ , కర్ణాటక లో దాదాపు 65 రోజుల లో షూటింగ్ పూర్తి చేసాము. 

ఇక ఇందులో సెన్సేషనల్   టైటిల్ సాంగ్ "రాజా రాజా మన్మధ రాజా  ..ఆజా ఆజా నా రాజా `` సాంగ్ ను  కొరియోగ్రాఫర్ నగేష్ హాలీవుడ్ స్టైల్ లో చిత్రీకరించారు. సాహితీ రాసిన ఈ పాటను మోహనా భోగరాజు పాడారు.  కంటెంట్ నచ్చి ఎక్కడా  రాజీ పడకుండా సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించాం. ఇక అక్టోబర్ లో ఆడియో రిలీజ్ చేసి సినిమాను నవంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు.


ప్ర‌భు సూర్య‌, ఆయుశ్రీ, ఇరాన్ , సూప‌ర్ మోడ‌ల్ అవా స‌ఫాయి, ఆరాధ్య త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి  ఈ చిత్రానికి సంగీతంః ఎల్విన్ జాషువా, సినిమాటోగ్రాఫ‌ర్ః ఎ.వెంక‌ట్; ఎడిట‌ర్ః వెంకీ యుడివి;  ఫైట్స్ః  థ్రిల్ల‌ర్ మంజు, మాస్ మద‌;  కొరియోగ్రాఫ‌ర్ః న‌గేష్‌.వి;  లిరిక్స్ః శ్రీమ‌ణి, సాహితి;   నిర్మాత‌లుః రాజ్ సూరియ‌న్‌, కిర‌ణ్ రెడ్డి, ప్ర‌భాకర్ రెడ్డి; ర‌చ‌న‌-ద‌ర్శ‌కత్వంః అశ్విన్ కృష్ణ‌.


మరింత సమాచారం తెలుసుకోండి: