కొన్నాళ్ల క్రితం కొరటాల శివ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన మిర్చి సినిమా అప్పట్లో పెద్ద హిట్ గా నిలిచి, అప్పటివరకు కెరీర్ పరంగా కొంత సతమతం అవుతున్న ప్రభాస్ కు మంచి విజయాన్ని అందించింది. ఇక ఆ తరువాత దర్శకధీరుడు రాజమౌళి, ప్రభాస్ ల కాంబినేషన్లో తెరకెక్కిన బాహుబలి రెండు భాగాలూ కూడా ఎంతటి అత్యద్భుత విజయాన్ని అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇక ఆ సినిమాల తరువాత ప్రభాస్, బాలీవుడ్ స్టార్ హీరోల రేంజ్ క్రేజ్ మరియు ఫాలోయింగ్ సంపాదించారు. ఇక అదే ఊపులో, యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ సాహో అనే సినిమాలో నటించడం, ఇక ఎన్నో అంచనాలతో ఆ సినిమా మొన్న ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. 

అయితే ఖర్చు పరంగా భారీ గ్రాఫిక్స్, మరియు విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కిన ఆ సినిమా, సరైన కథ మరియు కథనాలు లేక, ప్రేక్షకుల నుండి నెగటివ్ టాక్ సంపాదించడం జరిగింది. ఫేమస్ బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్, తొలిసారి ప్రభాస్ ప్రక్కన నటించిన ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ పై ప్రభాస్ స్నేహితులు వంశీ మరియు ప్రమోద్ నిర్మించడం జరిగింది. ఇక సాహోకు ఈ రెండు రోజులు సెలవులు కావడంతో కాస్త బెటర్ గా కలెక్షన్స్  రావడం జరిగిందని, ఇక రేపటినుండి ఈ సినిమాకు మరింతగా కలెక్షన్లు తగ్గే పరిస్థితి కనపడుతోందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇకపోతే దీని తరువాత ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమా జాన్. జిల్ మూవీ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఒక పెరియాడికల్ బ్యాక్ డ్రాప్ కథగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇప్పటికే 30 శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా మహర్షి భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. గోపి కృష్ణ మూవీస్ బ్యానర్ పై నిర్మితం అవుతున్న ఈ సినిమాకు కూడా భారీ స్థాయిలో ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. 

అయితే సాహోకు పెద్దగా అనుభవం లేని సుజీత్ ని దర్శకుడిగా ఎంచుకున్న ప్రభాస్, ఈ సినిమాకు కూడా మళ్ళి అటువంటి తప్పిదమే చేస్తున్నారని అంటున్నారు. నిజానికి రాధాకృష్ణ తొలి సినిమా జిల్, అప్పట్లో మంచి క్రేజ్ తో రిలీజ్ అయి, అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. మరి ప్రభాస్ అటువంటి దర్శకుడికి అవకాశం ఎందుకిచ్చారో అర్ధం కావడంలేదని, ఇప్పటికే కొత్త డైరెక్టర్ సుజీత్ తెరకెక్కించిన సాహో ఫెయిల్ కావడంతో, రాబోయే జాన్ సినిమా కూడా అలానే అవుతుందేమో అని డార్లింగ్ ఫ్యాన్స్ లోలోపల కొంత మధన పడుతున్నట్లు సమాచారం. మరి జాన్ సినిమా విషయమై ఏమి జరుగుతుందనేది తెలియాలంటే మాత్రం, ఆ సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే......!!


మరింత సమాచారం తెలుసుకోండి: