సాహో లాంటి భారీ నిర్మాణ విలువలు వున్న చిత్రాలు విడుదలైన తర్వాత వచ్చే 'సగటు' మధ్య తరగతి సినిమాలకి చాలా ఇబ్బంది ఎదురవుతుంది. ప్రేక్షకులు అలాంటి సెవెంటీ ఎంఎం ఎక్స్‌పీరియన్స్‌ చేసాక ఒక మామూలు బడ్జెట్‌ సినిమాని ఎంజాయ్‌ చేయలేరు. అయితే అది సదరు భారీ సినిమా ప్రేక్షకులని అంతగా ప్రభావితం చేసినపుడు ఎదురయ్యే సమస్య.

పరిణామం చూడవచ్చు. అలాగే సాహో తర్వాత రానున్న గ్యాంగ్‌ లీడర్‌కి కూడా బ్యాంగ్‌ అవుతుందని భావించారు. సాహో చూసిన కళ్లతో ఒక సగటు గ్యాంగ్‌లీడర్‌ని చూడలేరని విశ్లేషించారు.


కానీ సాహో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. ఏదో అడ్వాన్స్‌ బుకింగ్స్‌ చేసేసుకోవడం లేదా ఒకసారి చూడాలని ఫిక్సయిపోవడం వల్ల ప్రేక్షకులు తొలి నాలుగు రోజులు థియేటర్లకి వెళ్లారు కానీ సినిమా పరంగా సాహోని ఇటీవల వచ్చిన అతి చెత్త చిత్రాల గాటన కట్టేసారు ప్రేక్షకులు, విమర్శకులు. హిందీ క్రిటిక్స్‌ అయితే ఈ చిత్రానికి ఒకటి, ఒకటిన్నర రేటింగులు ఇచ్చి ఇదసలు సినిమానే కాదని తీర్మానించారు. 


కాబట్టి సాహో ఎఫెక్ట్‌ మరో పది రోజుల పాటు వుండే అవకాశమే లేదు. అంటే గ్యాంగ్‌ లీడర్‌ వచ్చేసరికి ఆడియన్స్‌ నార్మల్‌ మూడ్‌లోకి వచ్చేసి హంగులు, ఆర్భాటాలు ఆశించకుండా మంచి వినోదం వుంటే జై కొట్టేస్తారు.


సినీ పరిశ్రమలో చాలా హెల్తీ గా పోటీ నడుస్తోంది ఒకరి స్టార్ సినిమా మరొక స్టార్ హీరోలు హీరోయిన్లు ప్రోత్సహించడం, దాని మీద మంచి మంచి ట్వీట్లు చేయడం, అందరినీ వెళ్లి ఆ సినిమా చూడమని ప్రజలకు చెప్పడం మనం చూసాము. ఇలాగే సాహో సినిమా కి గ్యాంగ్లీడర్ గ్యాంగ్లీడర్ సినిమా సాహో కూడా సహాయపడి, ఒకరికొకరు మంచి హిట్ లను తెచ్చుకుని పరిశ్రమను నిలబడతారని ఆశిద్దాం.



మరింత సమాచారం తెలుసుకోండి: