రాజకీయాలను వదిలేసి.. సినిమాల్లోకి వస్తారంటూ వచ్చిన లేఖపై జనసేన పార్టీ వివరణ ఇచ్చింది. పవన్‌ కల్యాణ్‌ పేరిట వచ్చిన లేఖ పచ్చి మోసమని తెలిపింది. తప్పుడు లేఖ సృష్టించిన వారిపై కేసు దాఖలు చేస్తామని ప్రకటించింది. పవన్‌ కళ్యాణ్‌పై అశేష అభిమానంతో జనసేన శ్రేణులు, అభిమానులు ఘనంగా ఆయన జన్మదిన వేడుకలను నిర్వహించి, సేవా కార్యక్రమాలు జరిపారు.


ఇది చూసి ఓర్వలేని కొందరు పవన్‌ పేరిట ఒక తప్పుడు లేఖను సృష్టించినట్లు పార్టీ దృష్టికి వచ్చిందని జనసేన తెలిపింది.
పవన్‌ కల్యాణ్‌ తన పదవిని వదులుకొని సినిమాల్లో నటిస్తున్నారనే ఆ లేఖ పచ్చి మోసపూరితమైందని జనసేన పార్టీ తెలిపింది. ఇలాంటి అసత్య ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని స్పష్టం చేసింది. తప్పుడు లేఖను సృష్టించి సర్క్యులేట్‌ చేస్తున్నవారిపై కేసు దాఖలు చేసి, లీగల్‌‌గా ముందుకు వెళ్లాలని ఆ పార్టీ నిర్ణయించింది. పార్టీ లీగల్‌ విభాగం ఇందుకు అవసరమైన చర్యలు ప్రారంభిస్తోందని జనసేన తెలిపింది.


‘ఎన్నికలు అనేవి రాజకీయ, ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక భాగం మాత్రమే.. నిరంతరం ప్రజలకు చేరువగా ఉండి, ప్రజల పక్షాన
నిలవడమే తన బాధ్యతని పవన్‌ కళ్యాణ్‌ నమ్ముతారు. అందుకు అనుగుణంగా ప్రజా క్షేత్రంలోనే ఉంటున్నార’’ని జనసేన స్పష్టం చేసింది.పవన్‌కి శుభాకాంక్షల వెల్లువ.. టాలీవుడ్ పిలుస్తోంది మళ్లీ రావా!


పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ని ఫాన్స్ చాలా ఘనంగా జరుపుకున్నారు. అయితే ఈ మధ్యలో ఈ దుష్ప్రచారానికి చాలా చింతిస్తూ ఇది ఎవరు చేశారు అని కనుక్కోవడానికి ప్రయత్నించారు. రాజకీయాలలో ఇటువంటి ఆటుపోట్లు వస్తూనే ఉంటాయి. ఒకరి పైన మరొకరు దుష్ప్రచారం చేయడం వలన లాభం చేకూరుతుంది కాబట్టి అవసరం ఉన్నా లేకపోయినా చేయాలి. ఇటువంటి వాటికి పరిష్కారం అంత సులువుగా దొరకదు.




మరింత సమాచారం తెలుసుకోండి: