‘సాహో’ నెగిటివ్ టాక్ తెచ్చుకుని కూడ 300 కోట్ల గ్రాస్ కలక్షన్స్ తెచ్చుకోవడంతో పాటు ఈ మూవీ నెగిటివ్ టాక్ ను లెక్క చేయకుండా బాలీవుడ్ లో 100 కోట్ల నెట్ కలక్షన్స్ ను సాధించడంతో ఇప్పటి వరకు ప్రభాస్ ను విమర్శించిన బాలీవుడ్ మీడియా తన రూట్ మార్చి ప్రభాస్ పై ప్రశంసలు కురిపిస్తోంది. బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్ కన్నా ప్రభాస్ రేంజ్ పెద్దది అంటూ ఒక బాలీవుడ్ ప్రముఖ మీడియా సంస్థ కామెంట్స్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. 

దీనితో ‘సాహో’ రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ ప్రభాస్ ఇప్పటికే తనకు ఏర్పడిన నేషనల్ స్టార్ ఇమేజ్ ని సుస్థిరం చేసుకున్నాడు అని బాలీవుడ్ మీడియా అంగీకరించినట్లు అయింది. దీనితో బాలీవుడ్ మార్కెట్ పై ఇప్పటికే కన్నేసిన చరణ్ జూనియర్ మహేష్ లకు ప్రభాస్ పై బాలీవుడ్ మీడియా లేటెస్ట్ గా కురిపిస్తున్న ప్రశంసలు ఈ టాప్ హీరోలందరికీ షాక్ తో పాటు ఈర్ష్యను కూడ కలిగిస్తాయి అంటూ ప్రచారం జరుగుతోంది. 

వాస్తవానికి ‘ఆర్ ఆర్ ఆర్’ సక్సస్ అయినా మళ్ళీ జాతీయ స్థాయిలో ఆ క్రెడిట్ అంతా మళ్ళీ రాజమౌళి ఖాతాలోకి వెళ్ళిపోతుంది. అయితే రాజమౌళి సపోర్ట్ లేకుండా కేవలం ఒక అనుభవం లేని డైరెక్టర్ ను పెట్టుకుని ఆ మూవీకి ఫెయిల్యూర్ టాక్ వచ్చినా 300 కోట్లకు పైగా కలక్షన్స్ రాబట్టడం ప్రభాస్ సమర్ధత కన్నా అదృష్టం అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

1990 ప్రాంతాలలో రజినీకాంత్ ‘బాషా’ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్ ను షేక్ చేసాడు. అయితే ‘సాహో’ లాంటి కథలేని ఒక భారీ సినిమాలో నటించిన ఒక దక్షిణాది హీరో సినిమాకు కేవలం నాలుగు రోజులలో హిందీ ప్రాంతాలలో 100 కోట్లు రావడం మామూలు విషయం కాదు అంటూ బాలీవుడ్ మీడియా చేస్తున్న కామెంట్స్ ప్రభాస్ కు ఫెయిల్యూర్ లో విజయం తెచ్చిపెట్టాయి అని అనడంలో ఎటువంటి సందేహం లేదు.. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: