సహజనటి జయసుధది నలబై అయిదేళ్ళ సుదీర్ఘమైన సినీ కెరీర్. ఆమె 1973లో వచ్చిన పండంటి కాపురం సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. తరువాత ఎన్నో సినిమాలు నటిస్తూ నంబర్ వన్ స్టార్ గా ఎదిగారు. జయసుధ 200 పైగా చిత్రాల్లో నటించి అలనాటి మేటి నటుల సరసన సత్తా చాటారు. కానీ ఆమెకు తీరని అన్యాయమే జరిగింది.


అవార్డుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలుగు వారికి చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు, ఎంతో మంది ప్రతిభావంతులకు అవార్డులు అలా దక్కకుండా  పోయాయి. పద్మ అవార్డులకు జయసుధ పూర్తి అర్హురాలు. అయినా ఆమెకు కనీసం పద్మశ్రీ బిరుదు అయినా ఇంతవరకూ ఇవ్వలేదు. అయినా ఆమె తన నటననే దైవంగా భావించి కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ గుర్తింపు కంటే జనం అభిమానమే  తనకు శ్రీరామరక్ష అని కూడా అంటున్నారు. ఈ నేపధ్యంలో జయసుధను అభినయ మయూరి బిరుదుతో కళా బంధు టి సుబ్బరామిరెడ్డి ఘనంగా సత్కరిస్తున్నారు. విశాఖపట్నంలో ఈ నెల 17న జరిగే సుబ్బరామిరెడ్డి జన్మ దిన వేడుకల్లో ఈ బిరుదును జయసుధకు ఇస్తారు. 



ప్రతీ ఏటా సుబ్బరామిరెడ్డి తన జన్మ దిన వేడుకలను విశాఖలో పెద్ద ఎత్తున చేసుకుంటారు. ఎందరో కళాకారులకు ఆయన అవార్డులు ఇస్తారు. ఈసారి జయసుధను ఆయన సత్కరిస్తున్నారు. సుదీర్ఘమైన కెరీర్ ఉన్న జయసుధ లాంటి ఆర్టిస్టులు అరుదు అని ఆయన అన్నారు. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తమిళనాడు మాదిరిగా కళైమణి అవార్డులను ప్రకటిస్తే అందుకు అయ్యే డబ్బుని విరాళంగా ఇస్తానని ప్రకటించారు. మొత్తం మీద చూసుకుంటే మాత్రం ప్రభుత్వాలు మరచిన కళాకారులను ఆదరించడంలో టీయెస్సార్ గ్రేట్ అనిపించుకుంటున్నారు. మరి పాలకులు కూడా గ్రేట్ అనిపించుకుంటారా.



మరింత సమాచారం తెలుసుకోండి: