న్యాచురల్ స్టార్ నాని , మనం ఫేమ్ విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న  లేటెస్ట్ మూవీ 'నాని గ్యాంగ్ లీడర్'.  ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను  పూర్తి చేసుకొని విడుదలకు సిద్ద మవుతుంది.  సస్పెన్స్  థ్రిల్లర్ నేపథ్యంలో రానున్న   ఈ చిత్రంలో మలయాళ  బ్యూటీ   ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించగా   శరణ్య , లక్ష్మి  కీలక పాత్రల్లో కనిపించనున్నారు.  కాగా ఈ సినిమాతో  ప్రియాంక  తెలుగులో పరిచయం అవుతుంది. 




రివెంజ్ డ్రామా  గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్క్రీన్ ప్లే హైలైట్ కానుంది. ఇక ఈ చిత్రం యొక్క  ఓవర్సీస్ హక్కులను  సరిగమ సినిమాస్  5 కోట్లకు  సొంతం చేసుకుంది. ఆ లెక్కన ఈచిత్రం 1.6మిలియన్ల వసూళ్లను రాబడితేనే  బ్రేక్ ఈవెన్ అవుతుంది. అయితే నాని కి యూఎస్ లో మంచి మార్కెట్ ఉంది. ఇటీవల నాని నటించిన  జెర్సీ చిత్రం మరోసారి ఇదే విషయాన్ని నిరూపించింది.  సూపర్ హిట్ టాక్ తో జెర్సీ 1.5 మిలియన్ల వసూళ్లను రాబట్టి  అక్కడి బయ్యర్లకు  లాభాలను తీసుకొచ్చింది. 





ఒకవేళ  నాని గ్యాంగ్ లీడర్ కూడా  హిట్ టాక్ వస్తే మాత్రం  మరోసారి నాని  1మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరుతాడు.  ఇక ఈ చిత్రం యూఎస్ లో అత్యధికంగా 200థియేటర్లలో  విడుదలకానుంది. నాని కి  ఓవర్సీస్ లో ఇదే హైయెస్ట్ రిలీజ్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కోలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.  ఇక  సెప్టెంబర్ 13న ఈచిత్రం విడుదలకానుంది. ఆ రోజు  పెద్ద సినిమా ల  విడుదలలేకపోవడం కూడా ఈచిత్రానికి  కలిసి రానుంది.  మరి సోలో రిలీజ్ ను  నాని ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: