టాలీవుడ్ ఇండస్ట్రీలో వరస ఫ్లాపుల్లో ఉన్న న్యాచురల్ స్టార్ నాని 'జెర్సీ' సినిమా తో అదిరిపోయే హిట్ వచ్చింది. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాని నటించిన నటనకు చాలామంది ముగ్గులు అయిపోయారు. ప్రస్తుతం ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రీమేక్ అవుతోంది. 'కృష్ణార్జున యుద్ధం', 'దేవదాస్' వంటి ఫ్లాప్ సినిమాల తర్వాత నాని నటించిన 'జెర్సీ' సినిమా నాని కెరీర్ లోనే రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది దీంతో మరొకసారి కమర్షియల్ సక్సెస్ అందుకోవాలని భావించిన నాని విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'గ్యాంగ్ లీడర్' అనే సినిమా చేస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే.


ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు పాటలు మార్కెట్లో మంచి ఆదరణ అందుకుంటున్నాయి. ప్రముఖ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా త్వరలోనే రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇటువంటి నేపథ్యంలో గతంలో అదిరిపోయే హిట్ రావడంతో మార్కెట్ పెంచుకునే దిశగా న్యాచురల్ స్టార్ నాని గ్యాంగ్ లీడర్ సినిమా తన కెరీర్లోనే రికార్డు స్థాయిలో విడుదల చేయాలని భావిస్తున్నట్లు ఫిలింనగర్లో వార్తలు వినబడుతున్నాయి.


ముఖ్యంగా యూఎస్ లో ఎప్పుడు లేని విధంగా 200 లోకేషన్స్ లలో నాని సినిమా రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. నాని ఇప్పటికే ఆరు సార్లు యూఎస్ లో 1 మిలియన్ డాలర్స్ ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు గ్యాంగ్ లీడర్ తో కుర్ర హీరో డబుల్ మిలియన్ ని అందుకుంటాడని టాక్. సెప్టెంబర్ 13వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. నాని నటించిన జెర్సీ సినిమా గతంలో సూపర్ డూపర్ హిట్ కావడంతో 'గ్యాంగ్ లీడర్' సినిమా పై కూడా అంచనాలు బీభత్సంగా ఉన్నాయి. మరి ఈ సినిమాతో ఎటువంటి మ్యాజిక్ చేస్తాడో నాని చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: