జీవితం అన్నది ఎక్కడ ఎలా మొదలౌతుందో ఎక్కడ ఎలా మలుపులు తిరుగుందో ఎక్కడ ఎలా టర్న్ అవుతుందో చెప్పలేం.  జరుగుతున్న మార్పులకు అనుగుణంగా నడుచుకుంటూ పోవడం తప్పించి మనం ఏమి చేయలేని పరిస్థితి.  ఇది ఫిలాసఫీ కాదు జీవిత సత్యం కూడా.  ప్రతి ఒక్కరు లైఫ్ లో ఎదో కావాలని అనుకుంటారు.. చివరకు ఎదో అవుతున్నారు.  అలా ఏదో కావాలని వచ్చి.. చివరకు ఏదో అయినా వాళ్లలో మియా ఖలీఫా ఒకరు. 


చిన్నతనంలో ఆమె చాలా లావుగా ఉండేది.  అలా లావుగా ఉంటూ స్కూల్ కు వెళ్లడం అంటే.. చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేది.  కానీ తప్పదు కాబట్టి మియా ఖలీఫా స్కూల్ కు అలానే వెళ్ళేది.  కాలేజీకి వెళ్లడం మొదలుపెట్టిన తరువాత మియా ఖలీఫా లావు తగ్గాలి అనే లక్ష్యంతో పనిచేసింది.  కాలేజీ పూర్తయ్య సరికి చాలా సన్నగా మారిపోయింది.  


దీంతో ఆమెకు మోడలింగ్ చేసే  అవకాశం వచ్చింది.  మోడలింగ్ వైపుకు వెళ్లాలనిగాని, వెళ్తానని కానీ అనుకోలేదట మియా.  మోడలింగ్ వలన ఆమెకు మంచి పేరు వచ్చింది.  తక్కువ సమయంలోనే ఎక్కువ సంపాదన వచ్చింది.  అలా మోడలింగ్ చేస్తూ ఫోటో షూట్ చేస్తున్న సమయంలో షాక్ ఇచ్చే న్యూస్ ఒకటి విన్నది . మోడలింగ్ లో రాణించాలని అంటే చాలా సమయం పడుతుంది.  


అలా కాకుండా న్యూడ్ మోడలింగ్ చేస్తే ఎక్కువ డబ్బు వస్తుంది.. దాంతో పాటు త్వరగా ఫేమ్ అవ్వొచ్చు అని కొన్ని ఏజన్సీలు అఫర్ చేశాయట.  ఆ అఫర్ ఆమెకు బాగా నచ్చింది.  అఫర్ నచ్చడంతో ఖలీఫా న్యూడ్ మోడలింగ్ వైపుకు వెళ్ళింది.  డబ్బు దానికి తగ్గట్టుగా హోదా రెండు వచ్చాయి.  అలా మోడలింగ్ రంగంలో రాణిస్తున్న సమయంలో తెలియకుండా పోర్న్ సినిమాల వైపుకు ఆకర్షితురాలైంది.  అక్కడి నుంచి తప్పనిసరి పరిస్థితుల్లో మియా ఖలీఫా పోర్న్ సినిమాల్లో నటించాల్సి వచ్చిందని అంటోంది.  జీవితం ఎన్ని మలుపులు తిరిగినా.. దాన్ని తిరిగి దారిలోకి తీసుకు రావడంలోనే మనిషి జీవనం ఆధారపడి ఉంటుందని అంటోంది ఖలీఫా. 


మరింత సమాచారం తెలుసుకోండి: