భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ కైవసం చేసుకొని చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ క్రీడాకారిణి విజయ గాధను కూడా సినిమాగా తీయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు.. ఈ సింధు బయోపిక్ లో సమంత నటించబోతోందట. ప్రస్తుతం తన కుటుంబంతో కలిస స్పెయిన్‌లో విహరిస్తున్న సమంత.. తిరిగి భారత్ వచ్చాక ‘96’ రీమేక్‌లో నటిస్తారు.


ఈ సినిమా తర్వాత ఆమె ప్రముఖ నటుడు సోనూ సూద్ తెరకెక్కిస్తున్న పీవీ సింధు బయోపిక్‌లో బ్యాడ్మింటన్ ఛాంపియన్ పాత్రలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్త వచ్చిన కొన్ని రోజుల్లోనే మరో షాకింగ్ న్యూస్ వచ్చింది. తన జీవితం ఆధారంగా తీయబోతున్న సినిమాలో బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె నటిస్తే బాగుంటుందని సింధు షాకింగ్ కామెంట్స్ చేసింది. దీంతో ఆమె తన పాత్రలో సమంతా చేయడం తనకు ఇష్టం లేదని పరోక్షంగా చెప్పినట్టయింది.


ఆల్రెడీ సమంతా పేరు బాగా వినిపించిన తర్వాత సింధు ఇలా కామెంట్ చేయడం ఇప్పుడు సినీవర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. మీ పాత్రను వెండితెరపై చేయడానికి ఎవరు సరిపోతారు? అని విలేఖరులు అడిగితే... నా పాత్రలో దీపికా పదుకొణె నటిస్తే బాగుంటుంది. ఎందుకంటే.. ఆమె బ్యాడ్మింటన్‌ బాగా ఆడుతారు, అంతేకాకుండా గొప్ప నటి కూడా. కానీ ఈ విషయంలో నిర్మాతల తుది నిర్ణయాన్ని నేను గౌరవిస్తానంటూ చెప్పుకొచ్చింది పీవీ సింధు.


దీపికా పదుకొణే మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్ అన్నంత వరకూ బాగానే ఉంది. కానీ.. ఆమె చాలా మంచి నటి అంటే.. సమంత తన పాత్రను బాగా చేయలేదని సింధు భావిస్తోందా.. అన్న విమర్శలు వస్తున్నాయి. అంతే కాదు.. సింధు పాత్ర చేయాలంటే బ్యాడ్మింటన్ రావాలన్న రూల్ కూడా ఏమీ లేదుగా అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. అలా చెప్పాలంటే.. ఓ కిల్లర్ రోల్ చేయాలంటే హీరో గొప్ప హంతకుడు అయి ఉండాలా అన్న సెటైర్లు కూడా పడుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: