టాలీవుడ్ లో ఎంతో మంది కమెడియన్లు ఉన్నారు. తెలుగు లో ఉన్నంత మంది కమెడియన్లు ఏ భాషలోనూ లేరని అంటుంటారు. ఇంత మంది ఉన్నా కొత్త వారు వస్తూనే ఉన్నారు.  ప్రస్తుతం తెలుగులో జబర్ధస్త్ కమడియన్లు వరుసగా ఎంట్రీ ఇస్తూ తమ సత్తా చాటుతున్నారు.  అయితే సీతాకోకచిలుక సినిమాతో బాల నటుడిగా వెండి తెరకు పరిచయం అయిన ఆలీ తర్వాత స్టార్ కమెడియన్ గా మారాడు. కమెడియన్ గానే కాదు కొన్ని సినిమాల్లో హీరోగా నటించారు. ఓ వైపు హీరోగా నటిస్తూనే కమెడియన్ గా కొనసాగారు. ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్, జడ్జీగా వ్యవహరిస్తున్నారు.

ఇటీవల వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.  అయితే కొంత కాలంగా ఆలీ సినిమాల్లో ఎక్కువగా కనిపించడం లేదని టాక్ వినిపిస్తుంది.  పెద్ద హీరోల సినిమాల్లో అప్పుడప్పుడు కనిపిస్తున్నారు.  దానికి ముఖ్యకారణం ఓ వైపు బుల్లితెరపై యాంకరింగ్..మరోవైపు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం వల్ల బిజీగా మారిపోయారని అంటున్నారు. 


దర్శకుడు, నిర్మాత, నటుడు పోసాని కృష్ణ మూర్తి చిన్న పాత్రల్లో నటించి తర్వాత హీరో అవతారం ఎత్తాడు.  అది పెద్దగా వర్క్ ఔట్ కాకపోవడంతో కమెడియన్, విలన్ గా నటిస్తున్నారు.  కొంత కాలంగా పోసాని టాలీవుడ్ లో బిజీ నటుడిగా మారిపోయారు. అయితే ఇటీవల కాలంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి మంచి సపోర్ట్ చేశారు. ఆయన రాజకీయాల్లోకి వెళ్లడంతో సినిమా ఛాన్సులు తగ్గాయని టాక్ వినిపిస్తుంది. 


కృష్ణవంశి దర్శకత్వంలో వచ్చిన ‘ఖడ్గం’ మూవీతో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ వెరైటీ డైలాగ్ తో అందరిని ఆకర్షించిన ఫృథ్వి తర్వాత అదే డైలాగ్ తో ఫేమస్ అయ్యాడు.  ఇక తనదైన పేరడీ డైలాగ్స్ తో అందరినీ కడుపుబ్బా నవ్వించారు. ఇలా ఫృథ్వి టాప్ కమెడియన్ అయిన తర్వాత ఇటీవల ఏపిలో జరిగిన ఎన్నికల సందర్భంగా వైసీపీ కి గట్టి సపోర్ట్ చేశారు. ఏపీ సీఎం జగన్ వెంట ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొని ఆయనకు పూర్తి మద్దతు ఇచ్చారు.  ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నారు. 


ఇలా ఈ ముగ్గురు టాప్ కమెడియన్లు మంచి పొజీషన్లో ఉండగానే ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్ కి తమ మద్దతు తెలిపి ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.. ఒక్క పోసాని తప్ప. వీరే కాదు చాలా మంది టాలీవుడ్ నటులు ఎన్నికల ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: