టాలీవుడ్ లో ఎప్పటికీ మరుపురాని..మరువలేని మహానటులు నందమూరి తారక రామారావు.  సామాన్య రైతు కుటుంబంలో పుట్టి మంచి ఉద్యోగాన్ని కాదనుకొని సిని ప్రపంచంలోకి అడుగు పెట్టారు ఎన్టీఆర్.  సాంఘిక, పౌరాణిక, జానపద సినిమాల్లో ఎన్నో రకాల పాత్రల్లో నటించారు.  నటుడిగానే కాకుండా నిర్మత, దర్శకత్వంలో కూడా తన సత్తా చాటారు. ఇక సినీ జీవితంలో తనకు తృప్తి లేదని, ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాల్లోకి వెళ్లడమే సముచితం అనుకున్నారు.

అప్పట్లో కాంగ్రెస్ హవా నడుస్తుంది..ఇతర పార్టీవాళ్లను చాలా చులకనగా చూసేవారు. దాంతో తెలుగు వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించడానికి తానే స్వయంగా ‘తెలుగు దేశం’ అనే పార్టీని స్థాపించారు. పుసుపచ్చ రంగు ప్రతి గడను గుర్తుచేస్తుందని ఆ పార్టీ ఉద్దేశాన్ని తెలిపారు.  ఇలా తెలుగు దేశం పార్టీ స్థాపించిన తర్వాత ఆయన అఖండ మెజార్టీతో ముఖ్యమంత్రి అయ్యారు. 

ఇలా ఎన్టీఆర్ నటన,రాజకీయ జీవితంపై ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్ కథనాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాల వచ్చాయి. బయోపిక్ చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారుతున్నారు నిర్మాత విష్ణువర్థన్ ఇందూరి ఈ మూవీలను నిర్మించారు.  ప్రస్తుతం విష్ణు వర్ధన్ మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ జీవిత చరిత్రపై 83అనే మూవీ, జయలలిత బయోపిక్ మూవీ కంగనా రనౌత్ తో తెరకెక్కిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ బయోపిక్ ఫెయిల్యూర్ పై విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎన్టీఆర్ మూవీ నిర్మించినందుకు గర్వంగా ఉంది. కానీ ఎన్టీఆర్ బయోపిక్ అంచనాలు అందుకోలేదు.  ఈ మూవీని రెండు భాగాలుగా తీసి తప్పు చేశామేమో అనిపిస్తుంది. ప్రేక్షకులు కోరుకున్న ఏదో అంశాన్ని ఈ మూవీలో చూపించలేకపోయాం అని విష్ణు అన్నారు. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం నాకొక ఖరీదైన గుణపాఠం అని విష్ణు అభివర్ణించారు. ఎన్టీఆర్ బయోపిక్ కూడా ఒక సినిమాగానే తెరకెక్కించి ఉంటే బావుండేది అని విష్ణు అభిప్రాయ పడ్డారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: