కొందరు నటీమణలు సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించిన తరువాత వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుని హీరోయిన్లుగా నటించి మెల్లగా మంచి పేరు సంపాదిస్తారు. ఆ తరువాత కొద్దిరోజులకు అవకాశాలు తగ్గడం మొదలైతే, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారి అక్క, వదిన, అత్త వంటి పాత్రలు చేస్తుంటారు. అంతే తప్ప హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో నెగటివ్ క్యారెక్టర్స్ వంటివి చేయడానికి దాదాపుగా ఎవ్వరూ కూడా సాహసించరు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లోని ఒక హాట్ హీరోయిన్ మాత్రం అందుకు భిన్నంగా ఒక సినిమాలో నెగటివ్ పాత్రలో నటించడానికి సిద్దమయిందని సమాచారం. 

కొన్నేళ్ల క్రితం అలా ఎలా అనే చిన్న సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన హెబ్బా పటేల్, ఆ తరువాత కుమారి 21ఎఫ్, ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడ వంటి హిట్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల నుండి మంచి పేరు సంపాదించింది. అయితే ఆ తరువాత ఆమెకు కొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ, అవేవి పెద్దగా సక్సెస్ కాక ఈ అమ్మడు కొన్నాళ్లుగా తెలుగులో పెద్దగా సినిమాల్లేక ఖాళీగానే ఉంటోంది. ఇటీవల ఛలో చిత్ర దర్శకుడు వెంకీ కుడుములు దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కుతున్న భీష్మ సినిమా షూటింగ్ ప్రారంభమయింది. ఆకట్టుకునే వెరైటీ కథ, కథనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాలో అత్యంత కీలకమైన నెగటివ్ రోల్ ఒకటి ఉందని, 

ఆ పాత్రకు ఎవరిని తీసుకోవాలా అని దర్శక నిర్మాతలు ఆలోచిస్తుండగా, అనుకోకుండా హెబ్బా పేరు గుర్తుకు రావడం, వెంటనే ఆమె వద్దకు వెళ్లి తమ సినిమాలోని ఆ పాత్ర గురించి ఆమెకు చెప్పి నటించమని కోరడం జరిగిందట. అయితే సినిమా కథ మరియు అందులోని తన పాత్ర ఎంతో నచ్చడంతో, హెబ్బా వెంటనే ఆ పాత్రలో నటించడానికి ఒప్పుకుందట, అలానే మరికొద్దిరోజుల్లో ఆమె పాత్ర తాలూకు షూటింగ్ కూడా మొదలెట్టనుందట భీష్మ యూనిట్. అయితే ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా ప్రచారం అవుతున్న ఈ వార్త పై మాత్రం భీష్మ చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన వెలువడవలసి ఉంది.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: