తెలుగు సినిమా పరిశ్రమకు నాగ శౌర్య హీరోగా వెంకీ కుడుములు దర్శకత్వంలో తెరకెక్కిన ఛలో సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ రష్మిక, అంతక ముందు కన్నడనాట కిరిక్ పార్టీ అనే సినిమాతో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో అక్కడ మరొక రెండు సినిమాలు చేసింది రష్మిక. ఆ తరువాత ఒక్కసారిగా తెలుగులో అవకాశం రావడం, ఇక హీరోయిన్ గా నటించిన తొలిసినిమా ఛలో, సూపర్ హిట్ కావడంతో ఇక్కడి దర్శకుల కళ్ళు రష్మిక మీద పడ్డాయి. ఆ తరువాత విజయ్ దేవరకొండ హీరోగా, పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన గీత గోవిందం సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక, ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో, టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లో ఒకరిగా మారిపోయింది. 

అనంతరం ఆమె, నాని తో కలిసి జతకట్టిన దేవదాస్ ఫ్లాప్ కాగా, ఇటీవల మరొక్కసారి విజయ్ దేవరకొండతో కలిసి చేసిన డియర్ కామ్రేడ్ పర్వాలేదనిపించిది. ఇకపోతే ఇటీవల ఏకంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఈ భామపై కొద్దిరోజలుగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ కొంత గుస్సాగా ఉన్నారు. కారణం ఏమిటనేది తెలియనప్పటికీ, కొందరు మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం, తమ హీరో సినిమాలో హీరోయిన్ గా రష్మిక మాత్రం వద్దని, ఆమె బదులు పెద్దగా గ్లామర్ గా లేని వేరొక హీరోయిన్ ని తీసుకున్నా పర్లేదంటూ సోషల్ మీడియా మాధ్యమాల్లో తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి రష్మిక పై వస్తున్న ఈ నెగటివిటీ ఇప్పటిది కాదు, 

సూపర్ స్టార్ సినిమాలో రష్మిక నటించబోతోంది అంటూ కొద్దినెలలుగా వార్తలు రావడం మొదలైనప్పటి దగ్గరినుండి, కొందరు మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం ఆమెపై బాగా వ్యతిరేకత వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అయితే ఎట్టకేలకు సరిలేరు నీకెవ్వరు టీమ్ ఆమెనే హీరోయిన్ గా ఎంచుకుని షూటింగ్ కూడా జరిపించేస్తున్నప్పటికీ, ఇకనైనా ఆమెని తీసేయండి అంటూ ఇప్పటికీ కొందరు మహేష్ ఫ్యాన్స్ కోరుతుండడం గమనార్హం. ఎవరైనా హీరో లేదా హీరోయిన్లు కొత్తగా సినిమా పరిశ్రమలోకి ప్రవేశించినపుడు, అందులోని కొందరి పై ఈ విధమైన నెగటివిటీ రావడం సహజమని అయితే, ఇటువంటి వాటిని పెద్దగా లక్ష్య పెట్టవలసిన అవసరం లేదని అంటున్నారు సినీ విశ్లేషకులు....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: