ఆ మ‌ధ్య సోషల్ మీడియాలో నడుస్తున్న #MeToo ఉద్యమం బాలీవుడ్‌తో పాటు ఇతర రంగాల ప్రముఖులకు నిద్ర పట్టకుండా చేసింది. నటి తనుశ్రీ దత్తా ప్రారంభించిన మీటూ ఉద్యమం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేవలం సిని రంగంవారేకాక.. మీడియా రంగంలోని వారు ధైర్యంగా బయటకు వచ్చి తమకు ఎదురైన ఇబ్బందులను బయటపెట్టారు. బాలీవుడ్‌లోని చాలామంది ప్రముఖులు బాధితులకు మద్దతు తెలిపారు.‘ఈ దేశంలో చాలా విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ దేవతలకు గుళ్లు కడతారు. ఇళ్లలో ఫొటోలు, విగ్రహాలు పెట్టి పూజలు చేస్తారు. అదే ఇంట్లో ఆడవాళ్లను వేధిస్తారు. మహిళలను లైంగికంగా వేధించేవాళ్లు తమ శక్తిని దుర్వినియోగం చేస్తున్నారు’. ఒక మహిళ ‘నో’ చెప్పినా కూడా ఆమెను ఇబ్బంది పెడుతున్నట్లయితే, అది లైంగికంగా వేధించినట్లే.


ఇదిలా ఉంటే... బాలీవుడ్‌ నటి తనుశ్రీ దత్‌.. ఓ సంచలనం అని చెప్పాలి. ఎవరూ చేయలేని సాహసం చేసింది. తనకు జరిగిన అన్యాయంపై పోరాడింది. చిత్రసీమలో బలవంతులమని, పెద్ద మనుషులమని చెప్పుకుని తిరిగే వ్యక్తుల నీచపు బతుకులను బయటపెట్టింది. బాలీవుడ్‌లో 'మీటూ' ఉద్యమానికి నాంది పలికింది. ఈ పోరాటంలో గెలిచిందా? ఓడిందా? అన్నది పక్కన పెడితే..పోరాటంలో వెన్నుచూపలేదు. పలుకబడి గల మోతుబరులు హెచ్చరించినా పోలీసులకు చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకోలేదు. చివరికి పోలీసులే కేసును పక్కదారి పట్టించేలా, కావాలనే దర్యాప్తు సరిగ్గా చేయలేదని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి సచ్ఛీలురుగా తేల్చినప్పుడు తనుశ్రీ చెప్పిన మాట ఇది.

ఈమె మళ్లీ సినిమాల్లో నటించేందుకు వస్తున్నట్టు  ప్రకటించింది. 'అవును. మీరు విన్నది, అంటున్నది నిజమే. నేను మళ్లీ బాలీవుడ్‌కి తిరిగొస్తున్నా. నా అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నా. అందువల్ల ఈసారి మాత్రం ఉన్నత ప్రమాణాలు, మంచి అభిరుచులు ఉన్న వారితో కలిసి పనిచేస్తా. ఈ పోరాటంలో నాకు కలిగిన అనుభవనంతో నా జీవితాన్ని డిఫైన్‌ చేసుకోను. కొత్తగా నా జీవితాన్ని ఆవిష్కరించుకుంటా. నేను చేసేది ఆదర్శంగా ఉంటుంది'' అని తెలిపారు. ఈమె నానా పటేకర్‌తో నటించిన 'ప్లీజ్‌ హారన్‌' సినిమాలో చిత్రీకరణ సమయంలో లైంగిక వేధింపులకు గురి చేశారని ఆమె ఆరోపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: