నాగచైతన్య హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘జోష్’ విడుదలై 10 సంవత్సరాలు గడిచిపోయింది. మొదటి సినిమాతోనే ఫ్లాప్ ను అందుకున్న చైతన్య ఇప్పటి వరకు నటించిన సినిమాల సంఖ్య ఇంకా 20కు కూడ చేరువ కాకపోయినా చైతన్యకు సుమారు 13 ఫ్లాప్ లు ఉన్నాయి. ఇలాంటి అరుదైన రికార్డ్ మరో యంగ్ హీరోకి ఉంటే ఈపాటికి ఇండస్ట్రీ నుండి ఆ హీరో కనుమరుగు అయిపోయి ఉండేవాడు. 

చైతన్య ఇప్పటి వరకు నటించిన సినిమాలలో ‘ఏమాయ చేసావె’ ‘100% లవ్’ ‘ప్రేమమ్’ ‘మజిలీ’ మాత్రమే చైతన్య గుర్తించుకో తగ్గ సినిమాలు. చైతన్యకు మాస్ హీరో ఇమేజ్ అంటే చాల ఇష్టం ఈ ఇమేజ్ కోసం చేసిన ‘ఆటోనగర్ సూర్య’ ‘బెజవాడ’ ‘దోచేయ్’ ‘సాహసం శ్వాసగా సాగిపో’ ‘యుద్ధం శరణం’ భయంకరమైన ఫ్లాప్ లుగా మారాయి. 

అయితే ఎప్పటికైనా మాస్ హీరో అనిపించుకోవాలని చైతన్య తనవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇలాంటి పరిస్థితులలో రవితేజాతో అవమానానికి గురైన దర్శకుడు అజయ్ భూపతితో ఒక యాక్షన్ మూవీని చేయడానికి మళ్ళీ చైతన్య ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. తన మేనమామ వెంకటేష్ తో కలిసి నటించిన ‘వెంకీ మామ’ హిట్ చేయడం ద్వారా ‘మజిలీ’ తరువాత మరొక హిట్ అందుకోవాలని చైతన్య ప్రయత్నిస్తున్నాడు. 

చైతన్య తన కెరియర్ లో మొదటిసారిగా తెలంగాణ యాసలో డైలాగ్స్ చెపుతూ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవితో కలిసి నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు విజయాలను అందుకుంటే చైతన్య కెరియర్ ఒక గాడిలో పడుతుంది. 50 కోట్ల కలక్షన్స్ డ్రీమ్ అందుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న చైతన్య కలలు రానున్న కాలంలో అయినా నేరవేరుతాయేమో చూడాలి. ఆ రోజు కోసం చైతు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: