‘సాహో’ వేడి తగ్గి పోవడంతో ఇక అందరి దృష్టి వచ్చేవారం విడుదల కాబోతున్న నాని ‘గ్యాంగ్ లీడర్’ పై పడింది. ఈ సినిమా టైటిల్ ప్రకటన నుండి సంచలనాలు మొదలు కావడంతో అదే హైక్ కొనసాగుతుంది అని చాలామంది భావించారు. 

అయితే ఈ మూవీ విడుదల ఇక కేవలం వారంరోజులు మాత్రమే మిగిలి ఉన్నా ఇంకా ఈ మూవీకి ఇండస్ట్రీ వర్గాలలో ప్రీ రిలీజ్ పాజిటివ్ టాక్ క్రియేట్ చేసుకోలేక పోవడం నానీని కలవర పెడుతున్నట్లు టాక్. దీనికితోడు ఈ మూవీ ట్రైలర్ కు యూట్యూబ్ లో భారీ స్థాయిలో స్పందన రాకపోవడం నానీని కలవర పెడుతోంది అని అంటున్నారు. 

ఈ మూవీకి నాని క్రేజ్ రీత్యా బయ్యర్ల నుండి మంచి మార్కెట్ వచ్చినా దర్శకుడు విక్రమ్ కుమార్ ఇమేజ్ రీత్యా ఎంత వరకు ఈ మూవీకి భారీ కలక్షన్స్ వస్తాయి అన్న అనుమానం నానీని వెంటాడుతున్నట్లు టాక్. నానీ లేటెస్ట్ మూవీ ‘జెర్సీ’ హిట్ అయినప్పటికీ ఆ మూవీ కలక్షన్స్ 40 కోట్ల మార్క్ ను దాటలేకపోయింది. 

దానితో నాని కలలు కంటున్న 50 కోట్ల మార్క్ ను ‘గ్యాంగ్ లీడరు’ చేరుకుంటుందా లేదా అన్న సందేహాలు ఇండస్ట్రీ వర్గాలలో వ్యక్తం అవుతున్నాయి. ఈ మూవీని మాస్ ప్రేక్షకులకు దగ్గర చేయాలి అన్న ఉద్దేశ్యంతో ‘గ్యాంగ్ యూ లీడర్’ అనే మాస్ సాంగ్ ను లేటెస్ట్ గా రిలీజ్ చేసారు. ఈ సాంగ్ లో సీనియర్ నటి లక్ష్మీ యంగ్ హీరోయిన్ శరణ్యలు నానీకి పోటీగా స్టెప్స్ వేయడంతో ఈ మాస్ సాంగ్ అందరికీ కనెక్ట్ అవుతుందని నాని భావిస్తున్నాడు. ఎటువంటి పోటీ లేకుండా సోలో రిలీజ్ గా వస్తున్న ‘గ్యాంగ్ లీడర్’ హిట్ నాని కెరియర్ కు మరో మెట్టు ఎక్కడానికి ఎంతో ఆవశ్యకం..


మరింత సమాచారం తెలుసుకోండి: