రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన  యాక్షన్ ఎంటర్ టైనర్ సాహో టాక్ తో సంబంధం లేకుండా మొదటి నాలుగు రోజులు  అద్భుతమైన  వసూళ్లను  రాబట్టింది.  అయితే  ఆతరువాత  వీక్ డేస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో  బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేసింది.  దాంతో తెలుగు రాష్ట్రాల్లో  ఈ చిత్రం  74కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి డిజాస్టర్ ఫలితాన్ని చవిచూసింది.  కలెక్షన్ల పరంగా చూసుకుంటే అంత నెగిటివ్ టాక్ తో  ఈరెంజ్ లో వసూళ్లను సాధించడం గొప్ప విషయమే అయితే  సాహోను అధిక రేట్లు కు అమ్మడంతో భారీ నష్టాలను మిగిల్చింది.  





ఇక ఈ చిత్రం తెలుగు తోపాటు , హిందీ , మలయాళ , తమిళంలో  విడుదలకగా తమిళ , మలయాళ వెర్షన్ లు డిజాస్టర్ ఫలితాన్ని చవిచూశాయి. అయితే  హిందీలో మాత్రం ఈ సినిమా సత్తా చాటింది.  అంచనాలను మించి 100 కోట్ల కు పైగా షేర్ వసూళ్లను రాబట్టి  హిట్ అనిపించుకుంది.  ముఖ్యంగా బాహుబలి ప్రభావం ఈసినిమా ఫై చాలా పడింది.  ఇక ఈసినిమాకు  గనుక హిట్ టాక్ వచ్చి ఉంటే అక్కడ మరో 100కోట్లను రాబట్టేదే. 






ఇకఇదిలా ఉంటే ఓవర్సీస్ లో  కూడా ఈ చిత్రం భారీ నష్టాలనే మిగిల్చింది. అక్కడ సాహో  42కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా  20కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టింది.   ఓవరాల్ గా ఒక్క హిందీ లో తప్ప ఈ చిత్రం అంతటా బయ్యర్లకు  భారీ నష్టాలను తీసుకొచ్చింది.  సుజిత్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని 350కోట్ల భారీ బడ్జెట్ తో  యువీ క్రియేషన్స్ నిర్మించింది. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ద కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: