ఆరడుగుల అందగాడు...అభిమానుల డార్లింగ్ టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ . డార్లింగ్ ప్రభాస్ కి ఫ్యాన్ ఫాల్లోవింగ్ ఓ రేంజ్ లో ఉంటుందన్న విషయం అందరికి తెలిసిందే . అయితే  ఒకప్పుడు టాలీవుడ్ కి మాత్రమే పరిమితమయినా ప్రభాస్ ఫాన్స్ ... ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎక్కడ చుసిన కనిపిస్తారు. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ ప్రపంచ స్థాయిలో మారుమోగిపోయింది . బాహుబలి తో చాలా రోజుల వరకు ప్రభాస్ మానియా కొనిసాగొంది అంటే అతి శయోక్తి కాదు.ఇక బాహుబలి తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకున్న ప్రభాస్ ... మరో భారీ బడ్జెట్ సినిమా సాహూ  తో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది .


కాగా సినిమా విడుదలకి ముందు మూవీ కి సంబందించిన ఒక్కో వీడియో విడుదల చేస్తూ కేవలం అభిమానుల్లోనే కాదు ... మొత్తం అన్ని ఇండస్ట్రీలలో సంచలనం సృష్టించిన సాహూ... విడుదల తర్వాత మాత్రం అంచనాలను అందుకోలేక పోయిందంటూ నెగిటివ్ టాక్ వచ్చింది . ఆ తర్వాత మిక్సుడ్ టాక్ ముందుకెళ్తుంది సాహూ . కాగా సినిమా  టాక్ ఎలా ఉన్నప్పటికీ సాహూ కలక్షన్స్ మాత్రం ఎక్కడ తగ్గటం లేదు. రికార్డులు బ్రేక్ చేస్తూ ఇప్పటి వరకు 350 కోట్లు కొల్లగొట్టింది ప్రభాస్ సాహూ . ఇంకా థియేటర్లలో కొనసాగుతుంది .దీంతో  ఇంకా బారీ కలెక్షన్స్ రాబట్టేందుకు ఛాన్స్ కూడా ఉంది .


సాహూ సినిమా కలెక్షన్ల తో ప్రభాస్ మరో కొత్త రికార్డ్  నెలకొల్పాడు . బాలీవుడ్ బడా స్టార్ షారుక్ ఖాన్ , సల్మాన్ ఖాన్ ,అమీర్ ఖాన్ లను వెనక్కి నెట్టి రెకార్డుకెక్కాడు ప్రభాస్ . గత కొన్నేళ్ళనుండి బాలీవుడ్ బాదుషా షారుక్ ఖాన్ కి సరైన హిట్టు పడలేదు. "హ్యాపీ న్యూస్ ఇయర్" భారీ హిట్టు తర్వాత ...ఆ స్థాయిలో ఇప్పటి వరకు హిట్ కొట్టలేక పోయాడు షారుక్ . ఇక బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా దంగల్ , పీకే లాంటి సినిమాలతో భారీ హిట్లు కొడుతున్నప్పటికీ  ...తర్వాత సినిమాల్లో మాత్రం అదే ఊపు కొనసాగించలేక పోతున్నాడు . ఇక బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ కూడా సరైన స్థాయిలో హిట్టు కొట్టలేక పోతున్నాడు . కానీ ఆ ముగ్గురు ఖాన్ లు చేయలేనిది  రెబల్ స్టార్ సాధించాడు.బాహుబలి 1 ,2 లాంటి భారీ   స్థాయి హిట్టు కొట్టిన    ప్రభాస్ ...తాజాగా సాహూ కూడా 350 కోట్ల కలెక్షన్స్ దాటిపోవటం తో వరుస మూడు సినిమాల్లో 350  కోట్లి సాధించిన హీరోగా రికార్డ్ సృష్టించాడు .



మరింత సమాచారం తెలుసుకోండి: