టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన సినిమాలు ఎన్ని ఉన్నా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాలు కొన్ని ఉన్నాయి. శివ, గీతాంజలి, అన్నమయ్య,మన్మథుడు రీసెంట్ గా సోగ్గాడే చిన్నినాయన.  కళ్యాన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయ’ సినిమాలో ద్విపాత్రాభినయంలో నటించారు నాగార్జున.  ఈ మూవీలో తండ్రీ కొడుకు పాత్రలో నటించిన నాగ్ తండ్రి పాత్ర బంగార్రాజు.  ఈ పాత్ర చేసే అల్లరి, రొమాన్స్ అంతా ఇంతా కాదు..నాగార్జున నిజంగా ఈ పాత్రకు జీవం పోశారు. 

ఈ మూవీ మంచి సక్సెస్ సాధించిన తర్వాత సీక్వెల్ తీయాలని అనుకున్నారట..కానీ ఎప్పటికప్పుడు కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ పడుతూ వస్తుంది. ఈలోగా నాగార్జున నటించిన ఆఫీసర్, దేవదాసు, మన్మథుడు 2 బాక్సీఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.  అయితే సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు వస్తుందని ఆ మద్య తెగ వార్తలు వచ్చాయి.

ఈ మూవీకి కళ్యాన్ కృష్ణ దర్శకత్వం వహించబోతున్నారని, నాగార్జున తో పాటు ఆయన తనయుడు నాగ చైతన్య కూడా ఇందులో కనిపించబోతున్నారని వార్తలు వచ్చాయి.  అయితే ఈ మూవీ మాత్రం పట్టాలపైకి రావడం లేదు. ఒకదశలో ఈ మూవీకి బ్రేక్ పండిందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. దానికి కారణం ప్రస్తుతం నాగార్జున బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 3 కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

మరోవైపు కళ్యాన్ కృష్ణ  సోదరుడు మృతి చెందడం వంటి కారణాల వల్ల షూటింగ్ ఇంకా మొదలుకాలేదు. అయితే అక్టోబర్ లో షూటింగ్ మొదలుపెట్టి వచ్చే ఏడాది వేసవికి విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల డిలే అవుతూ వచ్చింది. మరి బంగార్రాజు తో అయినా నాగార్జున మంచి హిట్ కొడతాడా అని ఎదురు చూస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్. 


మరింత సమాచారం తెలుసుకోండి: