‘సాహో’ విడుదలై ఒక వారం పూర్తి కావడంతో ఈ మూవీ కలక్షన్స్ విషయంలో ఇక తేరుకోదు అన్న నిర్ధారణ అయింది. దీనితో ఈ మూవీని అత్యంత భారీ మొత్తాలకు కొనుక్కున్న బయ్యర్లు తమకు ఏ రేంజ్ లో నష్టాలు రాబోతున్నాయి అన్న లెక్కలు వేసుకుంటున్నారు. 

ఇలాంటి పరిస్థితులలో ‘సాహో’ ప్రభావం ‘సైరా’ బిజినెస్ పై ఉంటుంది అన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అయితే అందరి ఊహలకు భిన్నంగా ‘సైరా’ కు మెగా కాంపౌండ్ అనుకున్న స్థాయిలోనే బిజినెస్ జరగడం అత్యంత ఆశ్చర్యంగా మారింది. 

బయ్యర్లు ఈ విధంగా ‘సైరా’ విషయంలో ప్రవర్తించడానికి చిరంజీవి పై ఉన్న నమ్మకం అని అంటున్నారు. ‘ఖైదీ నెంబర్ 150’ లాంటి ఒక సాధారణ సినిమాలో చిరంజీవి నటిస్తే కలక్షన్స్ విషయంలో అద్భుతాలు జరిగిన నేపధ్యంలో భారీ బడ్జెట్ తో తీస్తున్న ‘సైరా’ కు చిరంజీవి ఇమేజ్ తోడు కావడం బయ్యర్ల నమ్మకాన్ని పెంచుతోంది అని టాక్. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు జరిగిన బిజినెస్ లెక్కల వ్యవహారాలకు సంబంధించి బయట వినిపిస్తున్న ఫిగర్స్ వేరు అసలు ఫిగర్స్ వేరు అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. 

వాస్తవానికి ఈ ‘సైరా’ బిజినెస్ లెక్కలు చూస్తున్న రామ్ చరణ్ కు మాత్రమే అసలు విషయాలు తెలుసని మార్కెట్ లో ఇమేజ్ పోకుండా ‘సైరా’ కు బిజినెస్ పరంగా కొన్ని చోట్ల ముఖ్యంగా ఓవర్సీస్ లో ఎదురీత ఎదురౌతున్నా ఆ విషయాలను బయటపడకుండా చరణ్ చాల జాగ్రత్తలు తీసుకుంటూ ‘సాహో’ ఎఫెక్ట్ ‘సైరా’ బిజినెస్ పై లేదు అన్న ఊహాత్మక సంకేతాలు ఇస్తున్నట్లు టాక్. వాస్తవానికి ‘సాహో’ ఫెయిల్యూర్ ‘సైరా’ పై పడుతున్నా ఈ విషయాలు పట్టించుకోకుండా తెలివిగా చరణ్ వ్యవహరిస్తున్న తీరు అతడి బిజినెస్ తెలివి తేటలను సూచిస్తోంది అని అంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: