ఏదేమైనా సాహో సాహో ఒకరకంగా సైరా కి గట్టి హెచ్చరికలే ఇచ్చింది. అందుకే చరణ్ అండ్ టీం బిజినెస్ వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా ఉన్నారు. అన్ని ఏరియాల్లో మంచి బిజినెస్ కూడా జరుగుతోంది. అయితే ఎక్కడ ఎంత వరకు బిజినెస్ అవుతుందనేది మాత్రం పక్కా క్లారిటి లేకుండా కాస్త గోప్యంగానే ఉంచుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే సైరా సినిమా బిజినెస్ మీద రకరకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర ఇంతకు అమ్మారు. వెస్ట్ అంతకు అమ్మారు. అడ్వాన్స్ ఇంత, రిటర్న్ బుల్ అడ్వాన్స్ అంత అంటూ రకరకాల ఫిగర్లు వినిపిస్తున్నాయి. కానీ అసలు లెక్కలు, వ్యవహారాలు వేరు అని విశ్వసనీయ వర్గాల సమాచారం. 

రామ్ చరణ్, ఆయన మేనేజర్ ప్రవీణ్, మెగా ప్యామిలీ సన్నిహితుడు శరత్ మరార్ మాత్రమే బిజినెస్ వ్యవహారాలు చూస్తున్నారట. బిజినెస్ డీల్ అన్నది అన్ని ఏరియాలు ఓ లెక్కలో వెళ్లడం లేదని కూడా అర్థమవుతోంది. అన్ని విధాలా మంచి రేటు రాబట్టాలనే ఆలోచనలో చిత్ర బృందం తలమునకలైనట్టు తాజా సమాచారం. అందుకే రిటర్న్ బుల్, నాన్ రిటర్న్ బుల్ అడ్వాన్స్ ల కింద బిజినెస్ చేస్తున్నారు. ఉదాహరణకు ఆంధ్ర 65లక్షల రేషియోలో అమ్ముతున్నారు. కానీ నెల్లూరుకు వచ్చేసరికి 60 లక్షల రేషియోలోనే మాటలు జరుగుతున్నాయట. కానీ ఇందులో కూడా ఇంకా తగ్గించాలనే చూస్తున్నారట.

ఓవర్ సీస్ కు 12 కోట్ల వరకు బేరం వచ్చింది. కానీ ఆ రేటుకు ఇవ్వమని రామ్ చరణ్ చెప్పేసారు. ఇప్పుడు రెండు సంస్థలతో బేరాలు సాగుతున్నాయి. కానీ ఈ లోగానే డీల్ క్లోజ్ చేసేశారు. మొత్తం మీద సైరా మంచి డీలే జరిగిందని తెలుస్తోంది. అందులో సందేహం లేదు. అయితే ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బయటకు వినిపిస్తున్న అంకెలన్నీ కరెక్ట్ కాదు అని. అలాగే బయటకు తెలియని టెర్మ్స్ ఎన్నో వున్నాయట. అయితే ఒకటి మాత్రం వాస్తవం. ఎవరికి అమ్మినా, ఎంతకు అమ్మినా, ఏ టర్మ్స్ మేరకు అమ్మినా, ప్రతి చోటా ఎన్ ఆర్ ఏ చేస్తున్నారు తప్ప, ఔట్ రేట్ అమ్మడం లేదు. మరి ఇలా ఎందుకు నిర్ణయించుకున్నారో తెలియాల్సి ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: