ఈ నెల 1వ తారీఖు నుంచి రోడ్డుపైకి వాహనాలు తీసుకు వెళ్లాలంటే గుండెల్లో ధడగా ఉంటుంది.  సాధారణంగా ఫోర్ విల్లర్ కానీ, టూ విల్లర్ కానీ ఏది తీసుకున్నా దానికి సంబంధించిన అన్ని కాగితాలు జాగ్రత్తగా ఉంచుకుంటాం..అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కూడా జాగ్రత్తగానే ఉంచుకుంటాం.  వాహనాల చట్ట ప్రకారం హెల్మెట్, సీటు బెల్టు పెట్టుకొని నడుపుతుంటాం.  కానీ ఒక్కోసారి ఇన్ని జాగ్రత్తలో ఏదో ఒక పొరపాటు చేయడం సహజం..ఇప్పుడు ఆ పొరపాటు గ్రహపాటు అవుతుంది. దిమ్మతిరిగే ఛలానాలు వేస్తున్నారు. 

ఈ ఐదురోజుల్లోనే కొన్ని షాకింగ్ సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. హెల్మెట్ పెట్టుకోలేదని ఆటో డ్రైవర్ కి ఫైన్, కారులో హెల్మెట్ పెట్టుకోలేదని, మరో వాహనదారుడికి ఐదువేలు..ఇలా ఇష్టానుసారంగా ఫైన్లు విధిస్తున్నారని వాహనదారులు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. మొత్తానికి ఇటీవల కాలంలో ట్రాఫిక్ రూల్స్ తో వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. హెల్మెట్ లైసెన్స్ లేకుంటే   సామాన్యుడి గుండెల్లో ఫైన్ లు భయాన్ని కలుగజేస్తోంది. 

ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై కౌంటర్లు కూడా బాగానే వేస్తున్నారు.  ఫైన్లు సరే మరి అధ్వాన్నంగా ఉన్న ఈ రోడ్ల పరిస్థితి ఏంటీ, గుంతల్లో పడిపోతే గాయలపాలైతే ఒకవేళ ప్రాణాలే పోతే ప్రభుత్వం వారు కట్టిస్తారా? అంటూ వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రిని ఒక హీరోయిన్ సోషల్ మీడియాలో కౌంటర్ వదిలారు.   కన్నడ బ్యూటీ  సోను గౌడ ట్విట్టర్ ద్వారా బెంగ‌ళూరు ముఖ్య‌మంత్రి య‌డియూర‌ప్ప‌ను ప్రశ్నించారు. జరిమానా రూపంలో ప్రజల సొమ్మును బాగానే వసూలు చేస్తున్నారు.

ముందు రోడ్ల దీని స్థితిపై ఆలోచించి అవి బాగు చేయండి..తర్వాత ఫైన్లు గట్టిగా వసూళ్లు చేయండి అంటూ ప్రజలకు సరైన రోడ్లు వేయించండి అంటూ వర్షంలో ఒక వాహనదారుడు కింద పడిన ఫొటోను కూడా సోనుగౌడ పోస్ట్ చేశారు. సెల్‌ఫోన్ వాడితే రూ.5వేలు.. మ‌ద్యం తాగితే రూ.10 వేలు ఫైన్ వేస్తున్న ప్రభుత్వానికి రోడ్లు బాగాలేక పోతే ఎంత  జరిమానా ఎంత విధించాలి అని సూటిగా పేర్కొన్నారు. ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..హీరోయిన్ కి చాలా మంది సపోర్ట్ చేస్తు కామెంట్స్ పెడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: