నాని తాజా చిత్రంగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన 'గ్యాంగ్ లీడర్' .. ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలైపోయాయి. తాజా ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ .. 'గ్యాంగ్ లీడర్' కథ చాలా కొత్తగా ఉంటుంది. పూర్తి వినోదభరితంగా ఈ కథ కొనసాగుతుంది'అని అన్నాడు.


ఒక రివెంజ్ స్టోరీని హాస్యంతో దర్శకుడు నడిపించిన తీరు ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలా ఆసక్తికరంగా సాగుతుంది .. ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా ఈ స్క్రీన్ ప్లే ను సెట్ చేయడం విక్రమ్ కుమార్ గొప్పతనం. ఈ గ్యాంగ్ లో అయిదుగురు ఆడవాళ్లు వుంటారు .. ప్రతినాయకుడి పాత్రలో కార్తికేయ కనిపిస్తాడు. అందరి పాత్రలకి ప్రాధాన్యత వుంది. ప్రతి పాత్ర ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది" అని చెప్పుకొచ్చాడు. చాలా మంది ఇదే ప్రశ్న ఎందుకు పదే పదే అడుగుతున్నారో అర్థం కావడం లేదు. జెర్సీ మూవీకి మంచి స్పందన రావడంతో పాటు, కమర్షియల్ గా కూడా మంచి విజయం సాధించింది. జెర్సీ బాక్సాఫీస్ వద్ద 30కోట్ల వసూళ్లు రాబట్టింది. అలాగే జెర్సీ అనేక ఇతర భాషలలో రీమేక్ చేయబడుతుంది. జెర్సీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్.


ఎప్పటి నుండో విక్రమ్ గారు నేను కలిసి పనిచేయాలని చూస్తున్నాం. నేను జెర్సీ మూవీ చిత్రీకరణలో ఉన్నప్పుడు నాకు ఆయన కొన్ని కథలు వినిపించారు. వాటిలో నాకు గ్యాంగ్ లీడర్ కథ నచ్చింది. ఇక నేను సుముఖత తెలపడంతో ఈ చిత్రం సెట్స్ పైకెళ్లింది.11ఏళ్ల సమయం ఎప్పుడైందో కూడా తెలియనంతగా కాలం గడిచిపోయింది. ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాను. ఇన్నేళ్ళుగా నన్ను ఆదరిస్తున్న అభిమానులకు కృతఙ్ఞతలు.


మరింత సమాచారం తెలుసుకోండి: