బిగ్ బాస్ సీజన్ 3 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా నడుస్తున్న ఈ సీజన్ బిగ్ బాస్ లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ వారం ఎలిమినేషన్ లో బిగ్ బాస్ ఆడియెన్స్ కు అదిరిపోయే షాక్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న శ్రీముఖి, రాహుల్, ఆలి రెజా, మహేష్, రవి కృష్ణలలో ఈరోజు నాగార్జున రాహుల్ ను సేవ్ చేశాడు.


అయితే ఊహించని విధంగా ఆదివారం ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయ్యేది అలి రెజానే అంటూ వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ లో ఎలిమినేషన్ అనేది ఆడియెన్స్ ఓటింగ్ ప్రక్రియ ద్వారానే జరిగినా చివరి నిమిషంలో డెశిషన్ మార్చే హక్కు బిగ్ బాస్ కు ఉంటుంది. ముందు రెండు సీజన్లలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి.   


ఇక 7వ వారం బిగ్ బాస్ లో కూడా ఊహించని షాక్ తగులుతుందట. ఇంటి నుండి ఈ వారం హౌజ్ నుండి స్ట్రాంగ్ కంటెస్టంట్ గా ఫీల్ అవుతున్న అలి రెజా ఎలిమినేట్ అవుతున్నట్టు తెలుస్తుంది. అదేంటి ఆలి హౌజ్ లో యాక్టివ్ గా ఉంటున్నాడు. అన్ని టాస్కులు బాగా చేస్తున్నాడు కదా అంటే.. టాస్కులలో మాత్రమే కనిపించడం మాత్రమే అలి చేస్తున్నాడని.. టాస్కుల్లో కూడా హౌజ్ మెట్స్ తో గొడవ పడుతున్నాడని అతని మీద కంప్లైంట్స్ ఉన్నాయి.


అందుకే అలిని బిగ్ బాస్ హౌజ్ నుండి ఎలిమినేట్ చేశారట. అలికి బయట ఫాలోయింగ్ ఉంది. అయితే ఇలానే అతన్ని కొనసాగిస్తే సీజన్ 2లో కౌశల్ కు పెరిగినట్టుగా అతనికి ఫాలోయింగ్ పెరిగి చివరకు ఫ్యాన్స్ చెప్పినట్టుగా గేమ్ ఆడించాల్సి వస్తుందని బిగ్ బాస్ నిర్వాహకులు భయపడ్డారని తెలుస్తుంది. ఫైనల్ గా అలి రెజా హౌజ్ నుండి బయటకు వచ్చాడని టాక్. అది నిజమా కాదా అన్నది మాత్రం రేపటి ఎపిసోడ్ లో తెలుస్తుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: