చాలామంది మీ వయసు ఎంత అంటే చెప్పడానికి పెద్దగా ఇష్టపడరు.  కారణం ఏంటి.. అంటే వయసు చెప్తే వామ్మో వాళ్లకు ఇంత వయసు ఉన్నది.  ఇంత వయస్సులో కూడా ఇంత అందంగా ఉన్నారా అని షాక్ అవుతుంటారు.  అందుకే  చాలామంది వయసు గురించి చెప్పరు.  చెప్పేందుకు ఇష్టపడరు.  ముఖ్యంగా హీరోయిన్లు.  ఒకప్పుడు హీరోయిన్లు వయసు చెప్పేందుకు ఇష్టపడేవారు కాదు.  ఇంట టెక్నాలజీ అప్పట్లో లేదు కాబట్టి అభిమానులు కూడా పెద్దగా పట్టించుకునేవారు కాదు.  


కానీ ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధిలోకి వచ్చింది.  సమాచార వ్యవస్థ డెవలప్ అయ్యింది.  ఎవరి వయసును ఎవరూ దాచలేరు.  ఎందుకంటే అది దోచుకునేది కాదు.  సెలెబ్రిటీ వయసు తెలుసుకోవాలంటే వికీపీడియా ఓపెన్ చేస్తే సర్వం బయట పడుతుంది.  అందుకే ఇప్పటి తరం హీరోయిన్లు వయసు కనిపించకపోతే పెద్దగా పట్టించుకోరు.  అది నా దగ్గరకు రాకుండా ఉంటె బాగుండు.. అనుకుంటారు. దగ్గరికి రాకపోతే.. హ్యాపీగా ఉండొచ్చు కదా.  


దగ్గరగా రాలేదనుకోండి.. నిత్యం యవ్వనంగా ఉండొచ్చు.  50 ఏళ్ళు వచ్చినా ఇంకా యవ్వనంగా స్ట్రాంగ్ గా కనిపించే హీరోయిన్లలో ఒకరు జెన్నిఫర్ లోపెజ్.  ఈ పేరు చెప్పగానే యూత్ కు హాలీవుడ్ సినిమాలు గుర్తుకు వస్తాయి.  ఒకప్పుడు జెన్నీ స్టార్ హీరోయిన్. ఇప్పుడు సినిమాలు తగ్గిపోయాయి.  జెన్నీ బహుముఖ ప్రజ్ఞాశాలి.  నటిగా నటిస్తూనే సినిమాలకు ప్రొడ్యూస్ చేసింది.  డైరెక్టర్ గా నిరూపించుకుంది.  వ్యాపారవేత్తగా రాణిస్తోంది.  సింగర్ గా మెప్పించింది.  ఇలా ఎన్నింటిలో ఆమెకు ప్రవేశం ఉన్నది.  


అది ఆమె ఆవేశంగా చేసింది కాదు.. అనుభవంతో చేసిందే.  అందుకే ప్రతి రంగంలో ఆమె సక్సెస్ అవుతూ వస్తున్నది.  వయసు అన్నది కూడా ఒకరకంగా బిజినెస్ లాంటిదే దాన్ని ఎంతచక్కగా, జాగ్రత్తగా నిర్వహిస్తామో అది అంతగా అభివృద్ధి చెందుతుంది.  బ్యూటీ కూడా అంతే.  జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తే.. కరిగిపోని కొవ్వొత్తిలా నిత్యం అలా వెలుగుతూనే ఉంటుంది.  వయసు గట్టకుండా కనిపిస్తూనే ఉంటుంది.  అదేదో సినిమాలో చెప్పినట్టు...వయసు ఆమెను మర్చిపోయింది.  అలా మనల్ని కూడా మన వయసు మర్చిపోతే ఎంత బాగుంటుంది.  ఎప్పుడు యవ్వనంగా కనిపించవచ్చు కదా.  


మరింత సమాచారం తెలుసుకోండి: