‘సైరా’ రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపధ్యంలో ఈమూవీ ప్రమోషన్ ను మొదలు పెట్టేసారు. ఈమూవీ గురించి ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు షేర్ చేసాడు. ‘బాహుబలి’ సినిమాకు ‘సైరా’ కు అసలు సంబంధం లేదని ‘బాహుబలి’ ఒక కాల్పనిక కథ అయితే ‘సైరా’ ఒక యదార్ధ చరిత్ర అంటూ కామెంట్స్ చేసాడు. 

అంతేకాదు తాను ‘సాహో’ రిజల్ట్ తరువాత ‘సైరా విడుదల అవుతున్నందుకు తానేమి భయపడటం లేదనీ డివైడ్ టాక్ తెచ్చుకున్న ‘సాహో’ కు 370 కలక్షన్స్ వస్తే తనకు విజయం పై ఏమాత్రం సందేహం లేని ‘సైరా’ కు ఎన్ని కోట్ల కలక్షన్స్ వస్తాయో తన ఊహకు అందని విషయంగా మారింది అంటూ కామెంట్స్ చేసాడు. ఇదే సందర్భంలో మరో ట్విస్ట్ ఇస్తూ ఈమూవీ షూటింగ్ అంతా పూర్తి అయిపోయిన తరువాత చిరంజీవి తనకు ఫోన్ చేసి ఒకసారి ఫైనల్ గా ఈమూవీ రషెస్ చూద్దాము అని చెప్పినప్పుడు తాను హడలిపోయిన విషయాన్ని బయటపెట్టాడు.

భయపడుతూనే తాను చిరంజీవి ఇంటికి వెళ్ళిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ అప్పటికే తన గురించి వెయిట్ చేస్తున్న చిరంజీవి అల్లుఅరవింద్ తో కలిసి ‘సైరా’ రషెస్ చూసి కొద్ది సేపు మౌనంగా ఉండటంతో తాను భయపడిన సందర్భాన్ని గుర్తుకు చేసుకున్నాడు. అయితే ఆశ్చర్యాన్ని కలిగిస్తూ చిరంజీవి తన వద్దకు వచ్చి ఘాడంగా కౌగిలించుకావడంతో ఆకౌగలింతలో తన తండ్రి ప్రేమ తనకు గుర్తుకు వచ్చింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. 

చిరంజీవి వర్కింగ్ స్టైల్ గురించి మాట్లాడుతూ ఉదయం 7 గంటలకు షూటింగ్ అనుకుంటే 5 నిముషాలు ముందుగానే సెట్ లో రెడీ అయి కూర్చునే చిరంజీవిని చూసి తాను ఆశ్చర్యపోయిన విషయాన్ని వివరిస్తూ ఈమూవీ షూటింగ్ కోసం చిరంజీవి చూపించిన ఏకాగ్రత తనకు షాక్ ఇచ్చింది అంటూ కామెంట్ చేసాడు. తన తండ్రికి ఒక అపూర్వమైన కానుక ఇవ్వాలి అన్న ఉద్దేశ్యంతో చరణ్ తనకు అనేకసార్లు ‘సైరా’ నిర్మాణంలో గుర్తు చేసిన విషయాన్ని వివరిస్తూ చరణ్ కోరిన విధంగా చిరంజీవికి ఒక అపూర్వమైన బహుమతిగా తామిద్దరం ‘సైరా’ ఇస్తున్న విషయాన్ని వివరించాడు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: