టాలీవుడ్ లో నేచురల్ స్టార్ గా మంచి పేరు తెచ్చుకున్న హీరో నాని.  భలే భలే మగాడివోయ్ సినిమా తర్వాత వరుస విజయాలు అందుకుంటున్నాడు.  కృష్ణార్జున యుద్దం, దేవదాసు కాస్త నిరాశ పరిచినా..ఇటీవల రిలీజ్ అయిన జర్సీ తో మంచి విజయం అందుకున్నాడు.  ఇక తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 కి హూస్ట్ గా వ్యవహరించారు.  అయితే బిగ్ బాస్ 2 లో ఎన్నో కాంట్రవర్సీలు నెలకొన్న విషయం తెలిసిందే.   మొదట్లో బిగ్ బాస్ హూస్ట్ చేస్తున్న సమయంలో నాని పై ఎన్నో ఆరోపణలు వచ్చాయి.  ఆయన ఇంటి సభ్యులను సరిగా డీల్ చేయలేక పోయాడని..శని, ఆదివారాల్లో పెద్దగా ఎంట్రటైన్ మెంట్ చేయలేకపోయాడని కామెంట్స్ వినిపించాయి. 

ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 3 కి కింగ్ నాగార్జున హూస్ట్ గా వ్యవహరిస్తున్నారు.  ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో నటిస్తున్నాడు.  గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ మూవీ గ్యాంగ్ లీడర్ టైటిల్ తో వస్తున్న ఈ మూవీపై నాని చాలా హూప్ పెట్టుకున్నాడు.  గతంలో ఈ టైటిల్ పై కూడా చాలా కాంప్లెంట్స్ వచ్చిన విషయం తెలిసిందే. 

ప్రస్తుతం బిగ్ బాస్ 3 ఏడో వారం నడుస్తుంది..గత శని, ఆదివారాల్లో నాగార్జున తన పుట్టిన రోజు సందర్భంగా స్పెయిన్ కి కుటుంబ సభ్యులతో వెళ్లిన నేపథ్యంలో నటి రమ్యకృష్ణ ఎంట్రీ ఇచ్చింది.  బిగ్ బాస్ 3 కి మొదటిసారిగా ఒక నటి హూస్ట్ గా వ్యవహరించడం ఇదే మొదటిసారి.  ఇక గత శని, ఆదివారాల్లో రమ్యకృష్ణ ఇంటి సభ్యులతో తెగ సందడి చేసింది.  నిన్న నాగార్జున రీ ఎంట్రీ ఇచ్చాడు. నేడు బిగ్ బాస్ 3 లోకి నేచురల్ స్టార్ నాని ఎంట్రీ ఇవ్వబోతున్నారట.  తన ‘గ్యాంగ్‌లీడర్‌’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా నానీ ఈ ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం.

విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో నాని నటించిన ఈ మూవీ ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. బిగ్‌బాస్‌-2కి వ్యాఖ్యాతగా వ్యవహరించిన నాని అప్పట్లో నాని, నాగార్జున కథానాయకులుగా నటించిన 'దేవదాస్‌' సినిమా ప్రమోషన్‌ కోసం నాగార్జున బిగ్‌బాస్‌కి వచ్చారు. ఇప్పుడు నాని ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్నమాట. మరి ఈసారి ఇద్దరు హూస్ట్ లు ఎలాంటి సందడి చేయబోతున్నారు అనేది కొద్ది గంటల్లో చూడొచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: