ఒక హీరోకు అతడు నటించిన ఒక సినిమా సూపర్ హిట్ అయితే ఆ హీరో మార్కెట్ బాగా పెరిగి పోవడమే కాకుండా ఆ హీరోకి వరస పెట్టి అవకాశాలు వస్తాయి. అయితే ‘ఇస్మార్ట్ శంకర్’ అనూహ్య విజయం రామ్ కెరియర్ కు శాపంగా మారిందా అంటూ ఇప్పడు ఇండస్ట్రీ వర్గాలలో కామెంట్స్ వస్తున్నాయి. దీనికి కారణం ఈమూవీ  విజయం తరువాత ఎన్ని కథలను రామ్ విన్నా ఏఒక్క కథని ఫైనల్ చేయలేని రామ్ అయోమయ స్థితి అని అంటున్నారు.

వరసగా మళ్ళీ మాస్ తరహా సినిమాలు చేయడం మంచిది కాదు అన్న అభిప్రాయంతో ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ లవ్ స్టోరీలకు సంబంధించి కథలను తీసుకురమ్మని చెపితే చాలామంది దర్శకులు రామ్ కు మాస్ కథలు వినిపిస్తున్నట్లు టాక్. వాస్తవానికి కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ ఒక ఫ్యామిలీ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఆ మూవీ కథలో రామ్ చెప్పిన మార్పులు కిషోర్ తిరుమల చేయలేక పోతున్నాడు అని టాక్. 

ఇది ఇలా ఉండగా మాస్ డైరెక్టర్ వినాయక్ దృష్టి రామ్ పై పడటంతో అతడి కోసం ఒక పవర్ ఫుల్ కథను వినాయక్ రెడీ పెట్టినా వినాయక్ ను పూర్తిగా నమ్మలేని స్థితిలో రామ్ ఉన్నాడు అని అంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఒక కథ ఫైనల్ అయితే కాని ఆ పాత్రకు సంబంధించి ఎలాంటి లుక్ ఏర్పరుచుకోవాలో ఒక క్లారిటీ రాదు కాబట్టి ప్రస్తుతం రామ్ తన శరీర ఫిట్ నెస్ కోసం గంటల తరపడి జిమ్ లో కసరత్తులు చేస్తూ తన కథల గురించి ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

రామ్ పెదనాన్న శ్రవంతి రవికిషోర్ రంగంలోకి దిగి రామ్ కు వచ్చిన సక్సస్ వృథా కాకుండా ఆ సక్సస్ ను ట్రాక్ లోకి పెట్టడానికి అనేకమంది యువ దర్శకులను లైన్ లో పెట్టి ఎదో ఒక మంచి కథ ఈ నెలాఖరు లోపుగా సెట్ చేసి త్వరలో సెట్స్ పైకి తీసుకు వెళ్లాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం రామ్ కు నచ్చే విధంగా కథ చెప్పే ఓపికలేక చాలామంది రచయితలు రామ్ పేరు చెపితే భయపడిపోతున్నారని ఇండస్ట్రీలో కామెంట్స్ వినిపిస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: