నాచురల్ స్టార్ నాని హీరోగా ఇటీవల తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ సినిమా, మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి కొన్నాళ్ళనుండి ప్రమోషన్ షురూ చేసిన గ్యాంగ్ లీడర్ యూనిట్, నిన్నటి నుండి మరింత వేగవంతంగా ప్రజల్లోకి వెళుతోంది. నిన్న రాత్రి తిరుపతి చేరుకున్న గ్యాంగ్ లీడర్ హీరో నాని మరియు ఆ సినిమా నిర్మాతలు, నేడు తిరుమల ఏడుకొండలవాడి దర్శనం చేసుకుని తమ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో హీరో నాని మాట్లాడుతూ, తమ యూనిట్ మొత్తం ఎంతో కష్టపడి పనిచేసిన ఈ సినిమా, రేపు రిలీజ్ తరువాత ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్మకాన్ని వెలిబుచ్చారు. 

ఇక తన అదృష్ట వశాత్తు, ఎక్కువగా తాను నటిస్తున్న సినిమాల్లో క్యారెక్టర్లు మంచి ఎంటర్టైనర్లు గా ఉండడం వల్లనే ఎక్కువగా ఆడియన్స్ కు రీచ్ అవుతున్నాయని, ఆ విధంగానే ఈ గ్యాంగ్ లీడర్ లోని పెన్సిల్ క్యారెక్టర్ కూడా తప్పకుండా ఆడియన్స్ ని ఎంతో అలరిస్తుందని అన్నారట. ఇక సినిమాలో నెగటివ్ ఫీల్ ఉన్న క్యారెక్టర్లో కార్తికేయ ఎంతో అద్భుతంగా నటించారని, అలానే దర్శకుడు విక్రమ్ సినిమాపై ఎంతో శ్రద్ధ పెట్టి తెరకెక్కించిన ఈ సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు బడ్జెట్ సహా అన్ని విషయాల్లోనూ పూర్తిగా సహకరించడం ఎంతో ఆనందదాయకమని ఆయన చెప్పారట. ఇక దీనితో పాటు సుధీర్ బాబుతో ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో మీరు నటిస్తున్న వి సినిమాలో మీ పాత్ర గురుంచి చెప్పండి అంటూ ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు, అది మాత్రం కాస్త  సస్పెన్స్, 

అయితే రేపు రిలీజ్ తరువాత మీకు నా పాత్ర తప్పకుండా నచ్చుతుంది అని నాని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఆ సినిమా ప్రారంభం నుండి అందులో నాని, మొదటిసారి నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు అంటూ విపరీతంగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇక నేడు నాని కూడా కొంత సస్పెన్స్ అన్నట్లుగా చెప్పడంతో, తప్పకుండా ఆయన నెగటివ్ పాత్రలోనే నటిస్తున్నారు అంటూ ఆ వార్తలు మరింతగా ప్రచారం అవుతున్నాయి. అయితే ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియాలంటే మాత్రం మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే. ఇక గ్యాంగ్ లీడర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా, నాని నేడు బిగ్ బాస్ షోలో సర్ప్రైజ్ ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: