టాలీవుడ్  మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టయిలిష్ డైరెక్టర్  సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మాణంలో మెగాపవర్ స్టార్  రామ్ చరణ్ సైరా నరసింహారెడ్డి సినిమాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను ప్యాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ స్థాయిలో ఐదు భాషల్లో విడుదల కాబోతున్న తొలి తెలుగు సినిమాగా సైరా నరసింహారెడ్డి రికార్డులకు ఎక్కింది.
ఇకపోతే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్,జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి ముఖ్యపాత్రల్లో నటించారు. ఇకపోతే ప్రస్తుతం  సైరా సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు చాలా వేగంగా సాగుతున్నాయి. అక్టోబర్ 2 వ తేదీన ఈ  సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనెల 15 వ తేదీ నుంచి ప్రమోషన్ ను షురూ చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇప్పటికే సంచలనాలు సృష్టించింది. దీనితో ఈ  సినిమాపై అంచనాలు  భారీగా పెరిగిపోయాయి.  

ఈ సమయంలో  మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ సోషల్ మీడియాలో ఓ ఫోటోను షేర్ చేశారు. ఆ ఫొటోలో చరణ్  మెగాస్టార్ కు ఎదురుగ నిలబడి.. గడ్డాన్ని సరిచేస్తున్నాడు.   ఆ ఫొటోకు అదిరిపోయే క్యాప్షన్ ఇచ్చారు. నిర్మాతగా మారిన తరువాత రియల్ మెగాస్టార్ ను చూశాను. సినిమా కోసం మెగాస్టార్ అంకిత భావంతో ఎలా పనిచేస్తారో చూశాను అని చెప్పి అన్నారు రామ్ చరణ్. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి జోడిగా నయనతార నటించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: