‘బాహుబలి’ వంటి విజువల్ వండర్ తర్వాత సంచలన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. షూటింగ్ ప్రారంభానికి ముందే దేశవ్యాప్తంగా క్యూరియాసిటీ క్రియేట్ చేసిన ఈ సినిమాపై దేశవ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి. యంగ్ టైగర్ ఎన్.టీ.ఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు మొట్టమొదటిసారిగా కలిసి నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ‘బాహుబలి’ రికార్డులను తిరగరాస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ చిత్రం ఎన్టీఆర్ లుక్  ఈ రోజు విడుద‌లైంది. ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో ఎన్టీఆర్ గజదొంగగా నటిస్తున్న విష‌యం తెలిసిందే. రామ్ చరణ్ అతన్ని పట్టుకునే పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు.. కాదండీ బాబు!! ఇద్దరూ బాక్సర్లు.. పైగా అన్నదమ్ములు. ఒకరు విలన్.. ఇంకొకరు హీరో. ఇంతకీ ఈ సినిమా టైటిల్ ఏంటి అనుకున్నారు ‘రామ రావణ రాజ్యం’. ఈ సినిమాలో సమంత కూడా ఉంద‌ని స‌మాచారం. కాజల్, రాశీ ఖన్నా.. రీసెంట్‌గా సీనియర్ నటీమణి ప్రియామణి కూడా నటించేస్తున్నారు? ఈ సినిమా కోసం రాజమౌళి బాహుబలి ‘కిలికీ’ టైప్‌లో కొత్త భాషను కూడా రాయిస్తున్నారంట.. అది కూడా విలన్‌గా నటిస్తున్న ఎన్టీఆర్ కోసమట తెల్సా..’’ ఇవన్నీ రాజమౌళి.. రామారావు.. రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీపై వస్తున్న పుకార్లు. ఇందులో ఏ ఒక్కదానిపై క్లారిటీ రాకపోగా.. తాజాగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఈ చిత్రంలో క‌నిపించ‌బోతున్న స్టిల్ ఒక‌టి హ‌ల్ చ‌ల్ చేస్తుంది. 


ఏ విష‌యంలోనూ కాంప్రమైజ్ కాడు జక్కన్న. అందుకే టెక్నాలజీ పరంగా బాహుబలి సినిమాని ప్రపంచస్థాయికి తీసుకెళ్లాడు. 'ఆర్.ఆర్.ఆర్' చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. రామ్‌చరణ్- ఎన్టీఆర్‌లపై యాక్షన్ సీన్స్ ఎవరూ ఊహించని రేంజ్‌లో ఉంటాయని, దాన్ని షూట్ చేసేందుకు ఏకంగా 120 కెమెరాలను వినియోగిస్తున్నాడని టాక్.


ఆ సన్నివేశాలు చిత్రీకరణ సమయంలో చెర్రీ, ఎన్టీఆర్ హావభావాలు, ముఖ కవళికలు 4డి టెక్నాలజీతో క్యాప్చర్‌ చేస్తున్నట్టు సమాచారం. ఈ టెక్నాలజీ ద్వారా సినిమా చూస్తున్న ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలుగుతుందట. ఈ విషయం తెలిసి సినీ‌లవర్స్ ఆశ్చర్య పోతున్నారు. ఇండియాలో అత్యంత హైటెక్నాలజీతో రూపొందిన మూవీ '2.ఓ'. ఇందులో 3డీ టెక్నాలజీతోపాటు 4డీ సౌండ్ వాడాడు శంకర్. ఐతే, 'ఆర్.ఆర్.ఆర్' మూవీ దాన్ని మించిపోయేలా ఉండబోతోందని ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. ఈ ప్రాజెక్టులో రాజమౌళి టెక్నాలజీకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: