కెరీర్ మొదటి నుంచి ఏ పాత్రకైనా న్యాయం చేయగలిగిన యాక్టర్ ఉంటే అది గోపీచంద్ అని చెప్పాలి. అది విలన్ పాత్ర అయినా సరే హీరో పాత్ర అయినా సరే గోపీచంద్ సినిమాలో ఉంటే కచ్చితంగా ఆనందపడతారు అని ప్రేక్షకులకు ఒక నమ్మకం. ఎన్నుకునే కథల్లో కూడా ఎంతో వైవిధ్యాన్ని చూపిస్తుంటారు గోపీచంద్. అంతకుముందు సినిమాలు అంతగా ఆడకపోయినా కూడా తన వైవిధ్యం లో ఎటువంటి మార్పులు చేయకుండా ఎప్పటికప్పుడు కొత్త కొత్త కథలను ఎన్నుకుని సినిమాలో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు.

తాజాగా గోపీచంద్ షూటింగ్ చేస్తున్న సినిమా పేరు చాణక్య షూటింగ్ పూర్తి చేసుకుని ఇప్పుడు రేపు టీజర్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ ను అందించారు. వై త్రీ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. గోపీచంద్ ఈ సినిమా పోస్టర్లలో చాలా అద్భుతంగా కనిపిస్తుండడంతో ఫ్యాన్స్ అందరూ ఈ గొప్పదనమంతా సినిమాటోగ్రాఫర్ అని సంబరపడిపోతున్నారు.

ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి డైరెక్టర్ తిరు. సినిమా పోస్టర్లు ఇంత అద్భుతంగా ఉంటే ఇక విశాల్ శేఖర్ అందించిన మ్యూజిక్ ఇంకెంత బాగుంటుందో అని ఫాన్స్ రేపటి టీజర్ లాంచ్ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. జరీన్ ఖాన్ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించినట్లు గా తెలుస్తోంది.

ఒకప్పుడు నిజం సినిమాలో చేసిన మన గోపీచంద్ ఏనా ఇంత వాడిగా ఎదిగిపోయాడు అని అందరూ ఆశ్చర్య పోయే విధంగా ఎంతో కష్టపడి కొత్త కొత్త పాత్రలు ఎన్నుకుంటారు ఆ పాత్రల కోసం అతని అలవాట్లను జీవితాన్ని మార్చుకుంటూ ఈరోజు ఇంతటి వాడిగా ఎదిగాడు గోపీచంద్. మరి రేపటి టీజర్ కోసం మనం గోపీచంద్ ఆల్ ద బెస్ట్ చెబుదామా. 



మరింత సమాచారం తెలుసుకోండి: