2011 లో వచ్చిన కెరటం అనే సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్, ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో తదుపరి తెలుగు సినిమాకు రెండేళ్లు గ్యాప్ తీసుకుంది. ఆ తరువాత 2013 లో సందీప్ కిషన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వచ్చిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాలో నటించిన రకుల్, ఆ సినిమా మంచి సక్సెస్ సాధించడంతో ఇక్కడి ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించింది. అంతేకాక ఆ సినిమాలో ఆమె చెప్పే ప్రార్ధన ప్రతి రూపాయి కౌంట్ ఇక్కడ అనే డైలాగ్ అప్పట్లో మంచి ఫేమస్ అయింది. ఆ తరువాత గోపీచంద్ తో చేసిన లౌక్యం, రామ్ చేసిన పండగ చేస్కో సినిమాలు మంచి సక్సెస్ సాదించడంతో ఈ అమ్మడుకి తెలుగులో మెల్లగా అవకాశాలు మొదలయ్యాయి. అయితే ఆ సమయంలో కొన్ని ఫ్లాప్ సినిమాల్లో కూడా నటించిన రకుల్, 

ఆ తరువాత నాన్నకు ప్రేమతో, సైరైనోడు, ధ్రువ, రారండోయి వేడుక చూద్దాం వంటి హిట్స్ తో మంచి క్రేజ్ సంపాదించింది. అయితే అప్పటినుండి ఇప్పటివరకు తెలుగులో కొన్ని చిన్న, పెద్ద సినిమాల్లో నటిస్తూ వచ్చిన రకుల్ కు సరైన సక్సెస్ మాత్రం దక్కలేదు. ఇక ఇటీవల కింగ్ నాగార్జునతో కలిసి నటించిన మన్మధుడు 2 సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకోగా, ఆ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర అపజయాన్ని మూటగట్టుకుంది. అలానే తమిళ్ లో కార్తీ తో నటించిన దేవ్, సూర్యతో చేసిన ఎన్జీకే సినిమాలు కూడా ఫ్లాప్స్ కావడంతో, ఇకపై నటించే సినిమాల విషయమై కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించిందట. ప్రస్తుతం ఈ భామ తమిళంలో శివకార్తికేయన్ సినిమాతో పాటు, శంకర్ ‘ఇండియన్ 2’లో అలానే హిందీలో ‘మర్జవాన్’ వంటి చిత్రాల్లో నటిస్తుండగా, 

రాబోయే రోజుల్లో లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించాలని నిర్ణయించినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే ఆ విధమైన స్క్రిప్ట్స్ తో తన వద్దకు దర్శకులు ఎవరైనా వస్తే అటువంటి పాత్రల్లో నటించడానికి తాను సిద్దమని, అయితే అటువంటి వాటిలో నిర్మాతలకు మంచి లాభాలు తెప్పిస్తాయని తాను భావించే సినిమాల్లో మాత్రమే నటిస్తానని, ఎందుకంటే నిర్మాతలను నష్టపెట్టే సినిమాల్లో నటించలేం కదా అని అంటోందట. అయితే రకుల్ ఎంచుకున్న ఈ మార్గం ప్రస్తుతం అనుష్క, సమంతలు అనుసరిస్తున్నదేనని, కాకపోతే వారిద్దరివలె రకుల్ ఎంతవరకు ఈ మార్గంలో సక్సెస్ సాధిస్తుంది అనేది తెలియాలంటే మాత్రం మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: