అందాల తార సమంత మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్. అమె చేసిన అన్ని సినిమాలు దాదాపుగా విజయవంతం అయ్యాయి. తెలుగు మరియు తమిళంలో దాదాపు అందరు టాప్ హీరోలతో నటించింది.సమంతకు అందం,అభినయం మరియు అదృష్టం మూడు ఉన్నాయి.ఆమె చివరగా  నటించిన "ఓ బేబి" సూపర్ హీట్ అయ్యింది. కానీ సోషల్ మీడియాలో పెళ్లి తరువాత ఆమెకు సినిమా ఛాన్స్ లు రావడం లేదని కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి.
ఈ కామెంట్స్ చేసే వారికి కి సమంత భర్త నాగ చైతన్య తనదైన శైలిలో సమాధానం చెప్పాడు. ఇది ఒక పోటి  కాదు ఎక్కువ సినిమాల్లో కనిపించడానికి. సమంత ఒక స్సక్సెస్ ఫుల్ హీరోయిన్ . ఆమె తనకు నచ్చిన పాత్రలు ఎంచుకునే వెసులుబాటు ఉంది. అందువల్ల తన దగ్గరికి వచ్చిన సినిమాల నుండి  అభినయానికి అవకాశం ఉన్న పాత్రలను ఎన్నుకుంటుంది.ఈ మాట నేను కాదు చివరి రెండు సంవత్సరాల నుండి ఆమె నటించిన సినిమాలు చెబుతాయి.రంగస్థలం- మహానటి- మజిలీ- యూటర్న్- ఓ బేబీ  సినిమాల్లో బెస్ట్ పర్ఫామెన్స్  ఇచ్చింది.

ఎన్ని ఎక్కువ సినిమాలు చేసాం అన్నది ముఖ్యం కాదు ఎన్ని మంచి సినిమాల్లో  నటించాం, ఎన్ని నాణ్యమైన పాత్రలు వేశాం అనేది ముఖ్యం.అందుకోసమే సమంత సినిమాలను తగ్గించుకుంది. కొత్త రకం పాత్రలతో ప్రేక్షకులను అలరించడమే ఆమె గోల్.సమంత బ్యాట్ మెంటన్ క్రీడాకారిణి పీవీ సింధు బయెపిక్ లో నటిస్తుందని వార్తలు వచ్చాయి కానీ అందులో నిజం లేదని తేలింది.సామ్ ఇప్పటికే రూటు మార్చారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నారు. సమంత ఒక వెబ్ సిరిస్ లో నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. అలాగే నిర్మాణ రంగంలో కూడా అడుగులు వెయ్యాలని చూస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వినిపించాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: