ఇండియన్ జేమ్స్ కామెరూ న్ గా పేరు పొందిన దర్శకుడు శంకర్. ఆయన సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో అందరికీ తెలిసిందే. రోబో సినిమా ద్వారా విజువల్ గ్రాండియర్ ని పరిచయం చేశాడు. ఆ తర్వాత వచ్చిన "ఐ"సినిమాలో కూడా విజువల్ ఎఫెక్ట్సే ప్రధానం. అయితే "ఐ" సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. మొన్న వచ్చిన 2.O కూడా సరైన విజయం అందించలేదు. దీంతో శంకర్ తన పాత ఫార్ములానే నమ్ముకున్నాడు.


ఎప్పటి నుండో భారతీయుడు 2 సినిమా గురించి రకరకాల ఊహాగానాలు వచ్చాయి. అయితే అవన్నీ నిజం చేస్తూ, భారతీయుడు 2 సినిమాని ప్రకటించాడు శంకర్. కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా కొన్ని రోజుల క్రితం షూటింగ్ జరుపుకుని, మధ్యలో ఆపేయడం జరిగింది. బడ్జెట్ కారణాల దృష్ట్యా షూటీంగ్ ని ఆపేసామని పేర్కొన్నారు. ఈ సినిమాకి బడ్జెట్ విపరీతంగా పెరిగిపోతుందని సదరు నిర్మాతలు భావించారట.


బడ్జెట్ తగ్గించుకుంటే షూటింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పడంతో ఇప్పటి వరకు షూటింగ్ ని వాయిదా వేశారు. అయితే తాజాగా శంకర్ బడ్జెట్ ని తగ్గిస్తానని చెప్పాడట. దాంతో ఈ సినిమా షూటింగ్ మళ్ళీ ప్రారంభించారు. ఎప్పుడూ బడ్జెట్ దగ్గర కాంప్రమైజ్ కానీ శంకర్ మొదటిసారి ఖర్చు తగ్గించి షూటింగ్ చేస్తానని చెప్పాడట. దాంతో పెద్ద పెద్ద సెట్టింగ్ లకి బదులు నార్మల్ లొకేషన్స్ లోనే చిత్రీకరణ చేస్తున్నారట.


ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రముఖ హోటల్ లో  భారతీయుడు 2 షూటింగ్ జరుపుకుంటుంది. ఇకపోతే ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్, ప్రియా భవాని శంకర్, ఐశ్వర్య రాజేశ్, విద్యుత్ జమ్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి ఈ సినిమాతోనైనా శంకర్ హిట్ కొడతాడేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: