మెగాస్టార్ చిరంజీవితో కలిసి వెండి తెరను పంచుకోవడం అంటే అది చిన్న విషయం కాదు. ఒక్క షాట్స్ లో చిరు పక్కన కనిపించిన చాలు జన్మ ధన్యం అనుకునే వాళ్ళు కోకొల్లలు. ఈ ఫీలింగ్ తెలుగులోనే కాదు మిగతా భాషల్లో ఉన్న నటీ నటుల్లోను ఉంది. ఇక ఇదే విషయం లో మెగాస్టార్ తో కలిసి నటించడమే గొప్పవిషయం అంటున్నాడు కన్నడ హీరో సుదీప్. మెగాస్టార్ లాంటి గొప్ప నటుడితో కలిసి వర్క్ చేస్తున్నప్పుడు పనికంటే ముందు ఆ ఫీలింగ్ ను ఎంజాయ్ చేయాలంటున్నాడు. సైరా షూట్ టైమ్ లో తను అదే పనిచేశానని తన ఆనందాన్ని వ్యక్తపరచాడు. అంతే ఆ తర్వాతే యాక్టింగ్ అయినా మరేదైనా అన్నాడు.

ఇక సైరా లో సుదీప్" పాత్ర గురించి, నరసింహారెడ్డి లైఫ్ లో ఆ పాత్ర ఇంపార్టెంట్ గురించి చెప్పాడు. చాలా మంచిపాత్ర. నేనేకాదు, ఎవరు చేసిన ఈ పాత్ర క్లిక్ అవుతుంది. వాళ్లు నన్ను సెలక్ట్ చేసినందుకు రుణపడి ఉంటాను. చిరంజీవి పక్కన నిలబడే ఛాన్స్ దొరికింది నాకు. నా క్యారెక్టర్ పక్కనపెడితే, ఆ మూమెంట్ ను ఎంజాయ్ చేయాలి. అదే చేశాను. జీవితంలో ఇలాంటి అవకాశం ఎవరికైనా ఒక్కసారే వస్తుంది. దాన్ని ఎంజాయ్ చేయాలి." అంటు తెగ ఎగ్జైట్ అయ్యాడు. 

"చిరంజీవికి ఇది సరైన సినిమా. అలాంటి వ్యక్తికి ఇలాంటి క్యారెక్టర్ పడాల్సిందే. రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించడం మరో గొప్ప విషయం. ఓ తండ్రికి, కొడుకు ఇంత కంటే గొప్ప బహుమతి ఇవ్వలేడేమో. ఇక చిరంజీవి విషయానికొస్తే ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. ఆయనతో కలిసి వర్క్ చేసిన ప్రతి నిమిషం నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది." నేనే కాదు మెగాస్టార్ నుంచి ఎవరైనా నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు.

రాజమౌళి తీసిన ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు సుదీప్. ఆ తర్వాత రాజమౌళి తీసిన బాహుబలి సినిమాలోను నటించాడు. అయితే ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్-ఆర్-ఆర్ సినిమాలో సుదీప్ కు క్యారెక్టర్ పడకపోవడంతో కాస్త బాధగా ఉన్నాడు. మరి రాజమౌళి సుదీప్ ను మర్చిపోయాడా..లేక కథలో కీలకమైన పాత్ర కు సుదీప్ సెట్ అవలేదా అన్నది జక్కన్న చెప్పాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: